నాగార్జునసాగర్ నేతలతో తరుణ్ చుగ్ భేటీ: ఉప ఎన్నికలపై వ్యూహ రచన

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయంగా ఆ పార్టీ చెప్పుకొంటుంది. సాగర్ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఈ ప్రచారాన్ని నిజం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. 

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ తరపున ఎవరిని బరిలోకి దింపుతారోననే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య అనారోగ్యంతో గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన మరణించాడు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి గతంలో పోటీ చేసిన అభ్యర్ధి మరోసారి ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ నుండి బీజేపీలో చేరిన కడారి అంజయ్య యాదవ్ కూడ పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు.
టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీ తేర చిన్నప్పరెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. చిన్నప్పరెడ్డి బీజేపీలో చేరితే ఆయనకు ఈ స్థానం నుండి పోటీ చేసేందుకు అవకాశం కల్పించే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడ సాగుతోంది.
దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయంతో పాటు జీహెచ్ఎంసీ లో 48 కార్పోరేట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకొంది. దీంతో నాగార్జునసాగర్ పై బీజేపీ ప్రస్తుతం కేంద్రీకరించింది.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని ఆ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ చేసుకొంటుంది. ఇందులో భాగంగానే ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకొంటుంది. ఇతర పార్టీల నుండి బీజేపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న నేతలకు కూడ బీజేపీ తలుపులు తెరుస్తోంది.
నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడ విజయం సాధించాలని బీజేపీ పావులు కదుపుతోంది. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాలను సాధించింది.
బీజేపీ తెలంగాణ ఇంచార్జీ తరుణ్ చుగ్ ఇవాళ నాగార్జునసాగర్ లో బీజేపీ కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.

Latest Videos

click me!