BJP: జూబ్లీహిల్స్ అభ్యర్ధిపై బీజేపీ తర్జనభర్జన.. సీటు ఎవరిని వరించేనో.?

Published : Oct 12, 2025, 01:44 PM IST

BJP: తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని లక్ష్యంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికను సవాల్‌గా తీసుకుంది కాంగ్రెస్. అటు బీఆర్ఎస్ నియోజకవర్గంపై పట్టు కోల్పోకూడదని.. గెలుపు కోసం ఉవ్విళ్ళూరుతోంది. మరి బీజేపీ సంగతి ఏంటి.?

PREV
15
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు తెరలేపింది. ఓట్లు చీలకుండా  ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. ఓట్ల చీలికతో అనూహ్య ఫలితానికి దారి తీయవచ్చునని ఆందోళన చెందుతున్నారు.

25
ఓట్లు చీలితే ఎవరికి లాభం

కాంగ్రెస్, BRS వర్గాలలో ఈ చర్చ విస్తృతంగా సాగుతోంది. ఓట్లు చీలితే ఎవరికి లాభం చేకూరుతుంది.? తమ వర్గం ఓట్లు చీలిపోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణ అంతటా గతంలో జరిగిన ఉపఎన్నికలలో పోటీ ఎక్కువగా రెండు ప్రధాన పార్టీల మధ్య జరిగాయి. బీఆర్ఎస్ vs కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ vs బీజేపీ. ఈ పోటీలు తరచుగా స్వల్ప ఓట్లతోనే నిర్ణయం తేలింది. 

35
పోరు మరింత రసవత్తరం

కానీ ఈసారి పోరు మరింత రసవత్తరంగా మారనుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఈ సీటును ఎలాగైనా గెలిచి తీరాలని లక్ష్యంగా పెట్టుకోగా.. బీఆర్ఎస్ తమ నియోజకవర్గంపై పట్టు నిలుపుకోవాలని ఆశిస్తోంది. ఇక సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ, అదే పార్లమెంటరీ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్‌లో కూడా విజయం సాధించాలని కృతనిశ్చయంతో ఉంది. అదే ఊపులో బలమైన అభ్యర్థిని బరిలో నిలబెట్టాలని యోచిస్తున్నట్లు పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.

45
బిజెపి కూడా OC అభ్యర్థినే.?

కాంగ్రెస్ ఇప్పటికే తన అభ్యర్థిని బీసీ అభ్యర్థిగా ప్రకటించింది. బీఆర్ఎస్ అభ్యర్థి ఓసీ వర్గానికి చెందినవారు కాగా.. బీజేపీ కూడా ఓసీ వర్గానికి చెందిన నాయకుడిని ఎంపిక చేస్తుందని తెలుస్తోంది. ఈ క్యాస్ట్ బ్యాలెన్స్ నియోజకవర్గంలో ఓటింగ్ సరళిని ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

55
ఎవరి అస్త్రం వారిది.? ప్రజలు ఎటు మరి.?

కాంగ్రెస్ పార్టీ తమ పాలన, అభివృద్ధి ఆధారపడి ఓట్లను అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. బీఆర్ఎస్ స్థానిక సెంటిమెంట్, అధికార పార్టీకున్న వ్యతిరేకతను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. అదే సమయంలో బీజేపీ ఇద్దరు ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంది. వారిపై ఉన్న అవినీతి ఆరోపణలను అస్త్రంగా మలుచుకుని 'డబుల్ ఇంజిన్ ప్రభుత్వం' దానికి ప్రత్యామ్నాయంగా చూపిస్తోంది. ఇక ప్రచారం ఊపందుకుంటున్న కొద్దీ మూడు ప్రధాన పార్టీలు ఒకదానికొకటి తమ కదలికలను నిశితంగా గమనిస్తున్నాయి. మరి ఇక్కడ ఓట్ల చీలిక ఏ పార్టీకి ప్రభావం చూపించనుందో వేచి చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories