ఉత్తమ్‌తో భేటీ, ఆ వెంటనే ఢీల్లీకి కోమటిరెడ్డి: ఏం జరుగుతోంది?

First Published Jun 20, 2021, 1:34 PM IST

టీపీసీసీకి కొత్త బాస్ ఎంపిక ప్రక్రియ పై ఊహగానాలు వెలువడుతున్న నేపథ్యంలో  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. 

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం నాడు ఢిల్లీకి వెళ్లారు. టీపీసీసీకి కొత్త బాస్ ఎంపిక ప్రక్రియ ఏ క్షణంలోనైనా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఢిల్లీకి కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి టూర్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
undefined
టీపీసీసీకి కొత్త బాస్ ఎంపిక కోసం గత వారంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఎఐసీసీ చీఫ్ సోనియాగాంధీతో భేటీ అయ్యారు
undefined
పీసీసీకి కొత్త చీఫ్ ఎంపిక విషయమై చర్చించారు. భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కలు గత వారంలో ఢిల్లీలో మకాం వేశారు. అయితే ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో నేతలంతా తిరిగి రాష్ట్రానికి వచ్చారు.
undefined
ఆదివారం నాడు ఉదయం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డితో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు.
undefined
టీపీసీసీ చీఫ్ రేసులో ఉన్న ఆశావాహులంతా చివరి సారిగా తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు
undefined
మాణికం ఠాగూర్ పీసీసీ చీఫ్ ఎంపికకు సంబంధించి తన నివేదికను సోనియాగాంధీకి అందించారు. 2018 నుండి తెలంగాణకు కొత్త పీసీసీ బాస్ ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది.
undefined
click me!