సీఎం రేసులో లేనని తేల్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
:తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాను సీఎం రేసులో ఉండనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. తనకు సీఎం పదవి అవసరం లేదన్నారు
సీఎం రేసులో లేనని తేల్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
brs flagబుధవారంనాడు భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు లేదన్నారు. బీఆర్ఎస్ లోనే వర్గపోరు ఎక్కువని ఆయన చెప్పారు.
సీఎం రేసులో లేనని తేల్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఇటీవల హైద్రాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన ప్రియాంక గాంధీ సభకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా ఉన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఉన్న కారణంగా ప్రియాంక గాంధీ సభకు దూరంగా ఉన్నట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కార్యాలయ సిబ్బంది చెప్పారు. ఈ విషయమై ప్రియాంక గాంధీకి కూడా సమాచారం ఇచ్చినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కార్యాలయం తెలిపింది.
సీఎం రేసులో లేనని తేల్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినట్టే తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
సీఎం రేసులో లేనని తేల్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
గత ఏడాదిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. బీజేపీలో చేరారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.
సీఎం రేసులో లేనని తేల్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
అయితే రానున్న ఎన్నికల్లో తాను నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుండి పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యాడు. 2019 పార్లమెంట్ ఎన్నికల్ో భువనగిరి నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించారు.