జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
25
ఎమ్మెల్సీ కవితతో పాటు తెలంగాణ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తదితరులు కూడా కొండగట్టు ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.
35
అదే సమయంలో ఆలయ ప్రాంగణంలో అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే హనుమాన్ చాలీసా పారాయణంలో కూడా ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు. ఇక, మధ్యాహ్నం జగిత్యాల పట్టణంలోని బీరప్ప ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
45
కొండగట్టు ఆలయంలో పూజలు చేసిన ఫొటోలను షేర్ చేసిన ఎమ్మెల్సీ కవిత.. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఈరోజు కొండగట్టును ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నట్టుగా చెప్పారు.
55
అంజన్న అందరికీ ఆయురారోగ్యాలతో శ్రేయస్సును ప్రసాదించాలని కోరుకున్నట్టుగా ఎమ్మెల్సీ కవిత చెప్పారు. అంతేకాకుండా.. ‘‘రామ లక్ష్మణ జానకి, జయ్ బోలో హనుమాన్ కీ’’ అని హిందీలో పేర్కొన్నారు.