పేరుకే బిచ్చగాళ్లు - హైదరాబాద్ లో నెల‌కు 2 ల‌క్ష‌లు సంపాదిస్తున్న బెగ్గర్స్

First Published Nov 1, 2024, 11:30 PM IST

Beggars In Hyd Earn Rs 2 Lakh A Month : హైదరాబాద్‌లో బిచ్చగాళ్లు చాలా రిచ్.. ఎందుకంటే ఇక్కడ బెగ్గర్స్ నెల‌కు ఏకంగా 2 ల‌క్ష‌ల రూపాయ‌లు సంపాదిస్తున్నారనే షాకింగ్ విషయాలు బహిర్గతం అయ్యాయి.

Beggars In Hyd Earn Rs 2 Lakh A Month: 'బిచ్చ‌గాళ్లు' అంటూ అడుక్కునే వారిని చిన్న చూపు చూడ‌కండి ఎందుకంటే సంపాద‌న‌లో వారు మీకంటే ఎక్కువ సంపాదించే వారు కూడా ఉన్నారు. పెద్ద మొత్తంలో జీతాలు అందుకునే ఉద్యోగుల‌తో స‌మానంగా వారు నెల సంపాద‌న ఉంటోంది. ఇది మీరు నమ్మ‌క‌పోయిన ఇదే నిజం. హైద‌రాబాద్ లో బిచ్చ‌గాళ్లు నెల‌కు ఏకంగా 2 ల‌క్ష‌ల రూపాయ‌లు సంపాదిస్తున్నారు. ఈ షాకింగ్ విష‌యాల‌ను హైద‌రాబాద్ పోలీసులు బ‌హిర్గ‌తం చేశారు.

విరాల్లోకెళ్తే.. హైదరాబాద్‌లో 'బెగ్గ‌ర్ మాఫియా'పై చ‌ర్య‌లు తీసుకునే క్ర‌మంలో బిచ్చ‌గాళ్లుగా జీవ‌నం సాగిస్తున్న‌ కొన్ని కుటుంబాలతో పోలీసులు మాట్లాడినప్పుడు షాకింగ్ విష‌యాలు వెలుగుచూశాయి. అందులో వారు నెల‌కు ఏకంగా 2 ల‌క్ష‌ల రూపాయ‌లు సంపాదిస్తున్నారు. 

హైద‌రాబాద్ నగరంలోని ట్రాఫిక్ జంక్షన్‌ల వద్ద భిక్షాటన చేసే కొన్ని కుటుంబాలు, అడుక్కునే వారు నెలకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఇటీవల నగరంలో బెగ్గ‌ర్ మాఫియా పై అణిచివేత చ‌ర్య‌లు తీసుకునే సమయంలో ఈ విష‌యాలు తెలిశాయ‌ని పోలీసులు పేర్కొన్నారు. 

Latest Videos


ఈ బిక్షాట‌న చేసే 'కుటుంబాలు' హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రై-కమిషనరేట్లలో ట్రాఫిక్ జంక్షన్ల వ‌ద్ద మ‌కాం వేసి భిక్షాట‌న చేస్తాయి. సిగ్న‌ల్ ప‌డిన వేంట‌నే అక్క‌డ ఆగిన వాహ‌న‌దారుల వ‌ద్ద అడుక్కుంటారు. ఒక సిగ్న‌ల్ జంక్ష‌న్ వ‌ద్ద ఒక్క కుటుంబం ఉంటుంది. అక్క‌డ‌కు వేరే వాళ్ల‌ను రానివ్వ‌ర‌ని కూడా పోలీసులు గుర్తించారు. 

"భర్త, భార్య, నలుగురైదుగురు పిల్లలు, వృద్ధులతో సహా మొత్తం కుటుంబం ఒక జంక్షన్‌ను త‌మ చేతుల్లోకి తీసుకుంటుంది. అంటే అక్క‌డ వారు మాత్ర‌మే అడుక్కుంటారు. ఇతరులను అక్కడక భిక్షాట‌న చేయ‌డానికి రానివ్వ‌రు. వారు సగటున రోజుకు రూ. 4,000 నుండి రూ. 7,000 వరకు సంపాదిస్తారు" అని హైదరాబాద్ పోలీసులు పేర్కొన్నారు.

హైద‌రాబాద్ ప్ర‌ధాన సిగ్న‌ల్ జంక్ష‌న్ల వ‌ద్ద బిచ్చగాళ్లు ఎక్కువ‌గా ఉంటార‌ని గుర్తించారు. ప్యారడైజ్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కెబిఆర్ పార్క్, మాసబ్ ట్యాంక్, అబిద్ రోడ్, ట్యాంక్ బండ్, కోటి ఉమెన్స్ కాలేజ్, చాంద్రాయణగుట్ట, మెహదీపట్నం వంటి రెమ్యునరేటివ్ జంక్షన్‌లకు ఈ ముఠాల ప్రాధాన్యతగా ఉంటుంద‌న్నారు.

ఇదే స‌మ‌యంలో వృద్ధుల‌ను, చిన్నారుల‌ను టార్గెట్ గా బెగ్గింగ్ మాఫియా అరాచ‌కాలు సాగిస్తున్న‌ద‌ని కూడా గుర్తించారు. అడుక్కోవ‌డానికి కూడా ప్రాంతాల‌ను విభ‌జించుకున్నార‌నీ, వివాదాలు వ‌స్తే ఈ బెగ్గింగ్ మాఫియా జోక్యం చేసుకుంటుంద‌ని తెలిపారు.

"అడుక్కునే కుటుంబాలు ఉదయం 10 గంటలకు ఆటో రిక్షాలలో వచ్చి రోజంతా జంక్షన్‌లో ఉంటారు. సాయంత్రానికి ఆటో రిక్షాల ద్వారా తమ ఇళ్లకు చేరుకుంటారు" అని అధికారి తెలిపారు. వీరిలో కొందరు కుటుంబాలు కూడా రుణాలు ఇచ్చే వ్యాపారం చేస్తున్నాయనీ, ఇంటికి తిరిగి వచ్చే సమయంలో బిర్యానీ పొట్లాలు, మద్యం లేదా కల్లు తీసుకుంటారని పోలీసులు గుర్తించారు.

ఆదాయంతో ఆకర్షితులై కొందరు అసాంఘిక వ్యక్తులు మాఫియాను ఏర్పాటు చేసి శారీరకంగా వికలాంగులు, పిల్లలు, వృద్ధులు, స్త్రీలను పనిలో పెట్టుకున్నార‌ని కూడా హైద‌రాబాద్ పోలీసులు గుర్తించారు. అడుక్కున్న వ‌చ్చిన మొత్తాన్ని తీసుకుని, రోజు చివరిలో నిర్వాహకులు ఒక్కొక్కరికి 200 రూపాయలు చెల్లిస్తున్నార‌నీ, వారికి ఆహారం - వసతిని నిర్వాహకులు అందిస్తున్నార‌ని తెలిపారు.

click me!