Holidays : ఎవరికైనా ఆర్థిక లావాదేవీలు అనగానే ముందుగా గుర్తుకువచ్చేది బ్యాంకులే. ఒకప్పుడు ఏ చిన్న ఆర్థిక వ్యవహారాలున్నా బ్యాంకు గడప తొక్కాల్సి వచ్చేది. కానీ నెట్ బ్యాకింగ్ సేవలు, బ్యాంక్ యాప్స్ వచ్చాక బ్యాంకులకు వెళ్లడం కొంచెం తగ్గింది... యూపిఐ రాకతో బ్యాంకులకు వెళ్లే అవసరం మరింత తగ్గింది. ఇవి చిన్నచిన్న ఆర్థిక లావాదేవీల విషయంలో బాగా ఉపయోగపడతాయి... కానీ పెద్దపెద్ద ఆర్థిక వ్యవహారాల్లో బ్యాంకుకు వెళ్ళడం తప్పనిసరి.
ఇలా చాలా అరుదుగా బ్యాంకులకు వెళ్లే సందర్భాలు వస్తాయి... పనిగట్టుకుని వెళ్ళాక బ్యాంకులు క్లోజ్ ఉంటే ఆ కోపం మామూలుగా ఉండదు. మన స్వస్థలాల్లో ఇలాజరిగితే సర్దుకుపోవచ్చు కానీ ఎక్కడికైనా బయటకు వెళ్లినపుడు ఇలా జరిగితే మాత్రం బాగా ఇబ్బందిపడాల్సి వస్తుంది. కాబట్టి బ్యాంకుల సెలవుల గురించి ముందే తెలుసుకోవడం ద్వారా ఈ పరిస్థితి నుండి తప్పించుకోవచ్చు.
25
జూన్ లో బ్యాంకులకు సెలవులే సెలవులు
స్థానిక పండగలు, ప్రత్యేక రోజులను బట్టి ఒక్కో రాష్ట్రం, ఒక్కో ప్రాంతంలో సెలవులు ఒక్కోవిధంగా ఉంటాయి. ఇలా ఏ రాష్ట్రంలో ఏ రోజు బ్యాంకులకు సెలవు ఉందో ఆర్బిఐ ముందే ప్రకటిస్తుంది. ఇలా ఈ జూన్ లో ఇప్పటికే చాలా సెలవులు వచ్చాయి... ఇప్పుడు మరో నాల్రోజులు సెలవులు వస్తున్నాయి. వాటిగురించి తెలుసుకుందాం.
35
జూన్ లో మిగిలిన నాల్రోజులు బ్యాంక్ హాలిడేసే
జూన్ 2025 లో మొత్తం 12 రోజులు సెలవులున్నాయి. ఈ నెలాఖరుకు చేరుకున్నా ఇంకా నాలుగు సెలవులు మిగిలున్నాయి. అందులో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా వర్తించే సెలవులు రెండు ఉన్నాయి... మిగతా రెండు సెలవులు కొన్ని రాష్ట్రాల బ్యాంకులకే వర్తించనున్నారు. మొత్తంగా ఈ నెలలో మిగిలిందే నాలుగురోజులు... ఆ నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులే.
జూన్ 27 అంటే రేపు హిందువులు ఎంతో పవిత్రంగా భావించే రథయాత్ర పర్వదినం. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు ఈరోజు ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు... అంటే ఉద్యోగులు కావాలనుకుంటే సెలవు తీసుకోవచ్చు. అధికారికంగా మాత్రం సెలవు ఉండదు. కానీ ఒడిషా, మణిపూర్ లో ఈ రథయాత్ర సందర్భంగా బ్యాంకులకు సెలవు ఇచ్చారు.
55
వరుసగా రెండ్రోజులు బ్యాంకులకు సెలవు
ఇక జూన్ 28న నాలుగో శనివారం. ప్రతినెల రెండు, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవులుంటాయి. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు సెలవే. జూన్ 29న ఆదివారం... కాబట్టి ఈరోజు కూడా బ్యాంకులకు సెలవే.
జూన్ 30 సోమవారం నెలలో చివరిరోజు. ఆరోజు ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మిజోరాంలో రెమ్నా ని అంటే మిజో బాషలో 'శాంతి దినం'. భారత ప్రభుత్వం, మిజో నేషనల్ ఫ్రంట్ మధ్య శాంతి ఒప్పందం జరిగిన రోజు... కాబట్టి ఈరోజు ఆ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.