Telangana: హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక...జులై 24 వరకు ఈ రూట్లో వెళ్లారో ..ఇక మీ పని అంతే..!

Published : Jun 26, 2025, 11:12 AM IST

గోల్కొండ బోనాల పండుగ జూన్ 26న ప్రారంభం. జులై 24 వరకు ప్రత్యేక ట్రాఫిక్ నియమాలు, పార్కింగ్ ఏర్పాట్లు అమలులోకి రానున్నాయి.

PREV
15
ట్రాఫిక్ ఆంక్షలు

తెలంగాణ భక్తి సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగకు హైదరాబాద్ గోల్కొండ కోట వేదికగా జూన్ 26న ఘనంగా శ్రీకారం చుట్టారు. జూలై 24 వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో గోల్కొండకు తరలివస్తున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, పోలీస్ శాఖ, ఆలయ కమిటీలు ముందస్తుగా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాయి. ముఖ్యంగా జూన్ 26, 29, జూలై 3, 6, 10, 13, 17, 20, 24 తేదీల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు గోల్కొండ కోట వైపు వచ్చే ముఖ్య రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.

25
ట్రాఫిక్ ఆంక్షలు అమలయ్యే మార్గాలు:

 రాందేవ్ గూడ నుండి మక్కా దర్వాజా

ఫతే దర్వాజా నుంచి లంగర్ హౌజ్

షేక్‌పేట్ నుంచి బంజారా దర్వాజా

ఈ మార్గాల్లో వాహనాల రాకపోకలు నిషేధించారు. పాదచారుల కోసం ప్రత్యేక మార్గాలు, మహిళలు, వృద్ధులు, బోనాలు మోసేవారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

35
పార్కింగ్ ఏర్పాట్లు:

రాందేవ్ గూడ వైపు,అషూర్ ఖానా,ఆర్మీ సెంట్రీ పోస్ట్,రాందేవ్ గూడ, గోల్కొండ పరిసరాలు,లంగర్ హౌజ్ వైపు,ఎంసీహెచ్ పార్క్,ఫతే దర్వాజా,అల్హీరా స్కూల్,ఏరియా హాస్పిటల్,షేక్‌పేట్, బంజారా దర్వాజా వైపు,గోల్ఫ్ క్లబ్ రోడ్ బై-లేన్,హాకీ గ్రౌండ్,డెక్కన్ పార్క్,ఓవైసీ గ్రౌండ్,సెవెన్ టూంబ్స్ పరిసరాలు,సెట్విన్ బస్సులు అషూర్ ఖానా వరకు మాత్రమే అనుమతిస్తారు.

45
ట్రాఫిక్ సమాచారం ఎలా తెలుసుకోవాలి?

 ప్రయాణికులు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారిక ఎక్స్ (Twitter), ఫేస్‌బుక్ ఖాతాలను ఫాలో అవుతూ, రూట్లపై తాజా అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు. ఇది అనవసరమైన ట్రాఫిక్ జాములు, భద్రతా సమస్యల నుంచి తప్పించుకునేందుకు సహాయపడుతుంది.

55
అధికారుల సమన్వయం – భక్తుల సహకారం

పండుగను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేస్తున్నాయి. నగరవాసులకు అసౌకర్యం కలగకుండా ముందుగానే ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Read more Photos on
click me!

Recommended Stories