
Bank Holidays in February : వచ్చే నెల ఫిబ్రవరిలో మీకు బ్యాంకులో ఏదయినా పని వుందా? ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకుకు వెళ్లాల్సి రావచ్చా? అయితే ఫిబ్రవరిలో బ్యాంకులు ఏ రోజుల్లో నడుస్తాయి... ఏ రోజుల్లో సెలవు వుందో తెలుసుకోవడం మంచింది. బ్యాంకులకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కారణంతో సెలవులు వుంటాయి... మరి తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఫిబ్రవరిలో ఎన్ని సెలవులు వున్నాయో చూద్దాం.
తెలంగాణ, ఏపీలోని బ్యాంకులకు సెలవులు :
న్యూ ఇయర్ లోకి తొలి అడుగే సెలవులతో పడింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జనవరి 1, 2025 లో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి. ఇక సంక్రాంతి పండక్కి కూడా తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఇచ్చారు. ఇక నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు ఎలాగూ బ్యాంక్ ఎంప్లాయిస్ కు సెలవే. ఇలా జనవరి బ్యాంకులకు బాగానే సెలవులు వచ్చాయి.
అయితే జనవరిలాగే ఫిబ్రవరిలో కూడా బ్యాంకులకు కొన్ని సెలవులు వస్తున్నాయి. నెలలో ఆదివారాలు, రెండు శనివారాలు (రెండు, నాలుగో) ఎలాగూ సెలవు వుంటుంది. అంటే ఫిబ్రవరి 2,8,9,16,22,23 తేధీల్లో బ్యాంక్ ఉద్యోగులకు సెలవు. ఇక ఫిబ్రవరి 26న మహా శివరాత్రి సందర్భంగా సెలవు వస్తుంది. అంటే మొత్తంగా ఫిబ్రవరిలో ఏడురోజులు బ్యాంకులు మూసివుండనున్నాయి.
ఫిబ్రవరిలో చివరి వీకెండ్ ను లాంగ్ వీకెండ్ గా మార్చుకోండిలా...
అయితే ఫిబ్రవరిలో ఓ వీకెండ్ ను బ్యాంక్ ఉద్యోగులు లాంగ్ వీకెండ్ గా మార్చుకోవచ్చు. ఫిబ్రవరి 22 నాలుగో శనివారం, ఫిబ్రవరి 23 ఆదివారం ఎలాగూ సెలవే... ఫిబ్రవరి 24, 25 తేదీలు అంటే రెండ్రోజులు లీవ్ తీసుకుంటే మళ్లీ ఫిబ్రవరి 26 శివరాత్రి సందర్భంగా మరో సెలవు కలిసివస్తుంది. కాబట్టి అధికారికంగా మూడు సెలవులు, అదనంగా రెండు లీవ్స్ కలుపుకుంటే వరుసగా ఐదురోజుల హాలిడేస్ వస్తాయి.
ఇలా ఫిబ్రవరి ఎండింగ్ లో వచ్చే వీకెండ్ ను బ్యాంక్ ఎంప్లాయిస్ లాంగ్ వీకెండ్ గా మార్చుకునే అవకాశం వుంది. ఈ ఐదురోజులు కుటుంబంతో టూర్ ప్లాన్ చేసుకోవచ్చు... ఇష్టమైన ప్రాంతాల్లో హాయిగా విహరించి రావచ్చు. హిందువులయితే ఆ మహాశివుడి ఇష్టమైన శివరాత్రి వేళ శ్రీశైలంకుగానీ లేదంటే మరేదైనా జ్యోతిర్లింగాన్ని, ఇతర ఆలయాలను సందర్శించిరావచ్చు.
మార్చిలో ఎలాగూ పిల్లలకు పరీక్షలు వుంటాయి... కాబట్టి వారు చదువుల ఒత్తిడిలో వుంటారు. ఈ సమయంలో సరదాగా బయటకు తీసుకువెళితే వారుకూడా కాస్త రిలాక్స్ అవుతారు. కాబట్టి బ్యాంక్ ఎంప్లాయిస్ ఈ లాంగ్ వీకెండ్ ను సద్వినియోగం చేసుకుని పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేసిరావచ్చు.
ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా బ్యాంక్ హాలిడేస్ :
ఫిబ్రవరి 2 : ఆదివారం
ఫిబ్రవరి 3 : సోమవారం వసంత పంచమి సందర్భంగా తెలంగాణలో ఆప్షనల్ హాలిడే వుంది. త్రిపురలో సెలవు వుంది.
ఫిబ్రవరి 8 : రెండో శనివారం
ఫిబ్రవరి 9 : ఆదివారం
ఫిబ్రవరి 11 : తమిళనాడులో సెలవు
ఫిబ్రవరి 12 : గురు రవిదాస్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లో హాలిడే
ఫిబ్రవరి 15 : లూయి నగై సందర్భంగా మణిపూర్ లో సెలవు
ఫిబ్రవరి 16 : ఆదివారం
ఫిబ్రవరి 19 : ఛత్రపతి శివాజి మహరాజ్ జయంతి సందర్భంగా మహారాష్ట్రలో సెలవు
ఫిబ్రవరి 20 : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ లో హాలిడే
ఫిబ్రవరి 22 : నాలుగో శనివారం
ఫిబ్రవరి 23 : ఆదివారం
ఫిబ్రవరి 26 : మహా శివరాత్రి
ఇది కూడా చదవండి :
School Holidays : ఫిబ్రవరి 3న స్కూళ్లు, కాలేజీలకు సెలవు ... లాంగ్ వీకెండ్ లో టూర్ ప్లాన్ చేసుకోండి