Rythu Bheema
Rythu Bheema : తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ది, రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ 2024-25 ను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. రేవంత్ సర్కార్ మొత్తం బడ్జెట్ రూ.2,91,159 కోట్లుగా వుంటే అందులో సింహభాగం వ్యవసాయ రంగానికే కేటాయించారు. ఏకంగా రూ.72,659 కోట్లను వ్యవసాయ, అనుబంధ రంగాలను కేటాయించారు.
Rythu Bheema
ఇప్పటికే రూ.2 లక్షల వ్యవసాయ రుణాల మాఫీ ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం మరో ఎన్నికల హామీపైనా క్లారిటీ ఇచ్చింది. రైతు భరోసా కింద అర్హులైన ప్రతి రైతుకు, ప్రతి ఏటా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని... ఇందుకు సంబంధించిన విధివిధానాల రూపకల్పన జరుగుతోందని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. ఇక పంటల భీమా, నాణ్యమైన విత్తనాలు సరఫరా, వరిపంటకు బోనస్, రైతుకూలీలకు ఆర్థిక సాయం... ఇలా వ్యవసాయానికి సంబంధించే వేల కోట్లు కేటాయించారు.
Rythu Bheema
తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతాంగానికి భరోసా ఇచ్చింది. ఇది రైతులు బడ్జెట్... దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండగలా మార్చే బడ్జెట్ ఇదని కాంగ్రెస్ నాయకులు కొనియాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతుబిడ్డలే... కాబట్టి బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్దపీట వేసారని అంటున్నారు.
Rythu Bheema
ఇదే సమయంలో అన్నదాతల కుటుంబాలకు అండగా నిలిచే కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతి రైతుకు రూ.5 లక్షల జీవిత భీమాను ప్రభుత్వం అందిస్తోంది. అయితే ఇటీవలకాలంలో భూములు కొనుగోలుచేసినవారు, వారసత్వంగా భూములు పొందినవారు అంటే కొత్తగా పాస్ బుక్ లు పొందినవారికి రైతు భీమా లేదు. ఇలాంటి వారినుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రభుత్వం.
Rythu Bheema
జూలై 28, 2024 లోపు కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందేవారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే రైతు భీమా దరఖాస్తుల కొనసాగుతోంది... ఆగస్ట్ 5, 2024 లోపు అవకాశం వుంటుంది. ప్రభుత్వం అందించే భీమా సౌకర్యం లేని ప్రతి రైతు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
Rythu Bheema
అర్హత కలిగిన రైతులు వ్యవసాయ అధికారులకు సంప్రదించండి. వారినుండి దరఖాస్తు ఫారం తీసుకుని ఫిల్ చేయాలి... దానికి పట్టాదారు పాస్ పుస్తకం, ఆదార్ కార్డ్ జతచేయాలి. నామినీ ఆధార్ కార్డును కూడా వీటికి జతచేసి సమర్పించాలి.
Rythu Bheema
వ్యవసాయ కుటుంబాలు ఇంటి పెద్దపైనే ఎక్కువగా ఆధారపడతారు. అలాంటిది రైతు చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. అలాంటి పరిస్థితి ఏ రైతు కుటుంబానికి రాకూడదని గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు భీమా పథకాన్ని తీసుకువచ్చింది. 2018 లో మాజీ సీఎం కేసీఆర్ దీన్ని ప్రారంభించారు.
Rythu Bheema
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) సహకారంతో ఈ రైతు భీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. అర్హులైన రైతుల తరపున జీవిత భీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే రూ.5 లక్షలు ఆ కుటుంబానికి చెల్లిస్తారు... దరఖాస్తు సమయంలో పేర్కొన్న నామినీకి 10 రోజుల్లోపు ఈ డబ్బులు వస్తాయి. 18 ఏళ్ల యువ రైతులను నుండి 59 ఏళ్లలోపు అన్నదాతలు ఈ పథకానికి అర్హులుగా నిర్దారించారు.