Aghori in Komuravelli: తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా తన వివాద్పద వైఖరితో ఉద్రిక్తతలు సృష్టిస్తున్న అఘోరి మరోసారి వివాదాస్పద వైఖరీతో వార్తల్లో నిలిచారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద అఘోరి పలువురిపై తనవెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఆలయ సమీపంలో భయానక పరిస్థితులను అఘోరి సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అఘోరి భక్తులపై ఎందుకు దాడి చేశారు?
సిద్దిపేటలోని కొమురవెల్లి మల్లికార్జున ఆలయంలో వద్దకు మహిళా అఘోరి వచ్చారు. నగ్నంగా ఆలయంలోకి రావడంపై అక్కడి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనప్పటికీ దర్శనం చేసుకునేందుకు ప్రయత్నించింది. కానీ దుస్తులు ధరించి ఆలయంలోకి రావాలని మరోసారి సూచించారు. దీంతో అఘోరి ఆగ్రహానికి గురయ్యారు.
భారీగా అఘోరి చూడటానికి వచ్చిన జనం
కొమురవెల్లి ఆలయానికి అఘోరి రావడంతో అక్కడకు చాలా మంది జనాలు వచ్చారు. ఈ సమయంలోనే మహిళా అఘోరి ఆలయంలోకి వెళ్లాలని చూశారు. అయితే, పూర్తిగా బట్టలు ధరించి ఆలయంలోకి రావాలని చెప్పడంతో ఆగ్రహానికి లోనయ్యారు. తన వెంట తెచ్చుకున్న కత్తితో పలువురిపై దాడి చేశారు. ఆ దాడిలో కొంతమందికి గాయాలు అయ్యాయి. ఈ సమయంలో అక్కడ భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి.