షబ్-ఇ-మెరాజ్ ప్రత్యేకత ఏమిటి?
మంగళవారం షబ్-ఇ-మెరాజ్ వేడుకల కోసం ముస్లింలు సిద్దమవుతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ముస్లింలు అత్యధికంగా నివాసముండే పాతబస్తీ ప్రాంతం పండగశోభను సంతరించుకుంది. ఈ పవిత్రమైన రోజున ప్రార్థన చేస్తే ఆ అల్లా పాపపరిహారం చేస్తాడని ముస్లింల నమ్మకం. అందుకే దీన్ని 'క్షమాపణ రాత్రి' అని కూడా అంటారు... ఈ రోజు ప్రత్యేక ప్రార్థనలు చేపడతారు.
షబ్-ఇ-మెరాజ్ సందర్భంగా కొందరు తమ పాపపరిహారం కోసమే కాదు కుటుంబసభ్యుల కోసం కూడా ప్రార్థనలు చేస్తారు. ఈ రోజు ఆ అల్లా స్వర్గం నుండి దిగివచ్చి మనస్పూర్తిగా ప్రార్థన చేసేవారి మొర ఆలకిస్తాడని నమ్ముతారు. అందువల్లే కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో వున్నా, ఇతర సమస్యలున్నా వాటినుండి బయటపడేయాలని కోరతారు. భవిష్యత్ బాగుండాలనే... మీ దయ ఎప్పుడూ తమపై వుండాలని అల్లాను వేడుకుంటారు.
ఈ షబ్-ఇ-మెరాజ్ వేడుకలను ఇండియాలోనే కాదు ఇంకా చాలా దేశాల్లో జరుపుకుంటారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, టర్కీతో పాటు మధ్య ఆసియా దేశాలైన ఉజ్జెకిస్తాన్, తజకిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, కిర్గిస్తాన్ వంటి దేశాల్లో కూడా జరుపుకుంటారు.