ఈ మినీ డిస్నీల్యాడ్ విశేషాలు :
హైదరాబాద్ శివారులోని ప్రకృతి అందాలమధ్య వెలిసింది ఈ డైసీ డేల్ ఫార్మ్ పార్క్ ఆండ్ రిసార్ట్. ప్రశాంత వాతావరణంలో పిల్లలతో సరదాగా గడపాలనుకునే పేరెంట్స్ కు ఇది పర్ఫెక్ట్ స్పాట్. నగరానికి చాలా దగ్గరగా పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో వుంటుంది ఈ పార్క్ ఆండ్ రిసార్ట్.
ఇక్కడ పిల్లలకోసం గేమ్స్ మాత్రమే కాదు విజ్ఞానాన్ని అందించే ఏర్పాట్లు కూడా వున్నాయి. ఇక్కడ వివిధ రకాల పెంపుడు జంతువులు (ఆవులు, మేకలు, పందులు, కుందేళ్లు), అందమైన పక్షులను (మాట్లాడే రంగురంగుల చిలకలు) కూడా చూడవచ్చు. అంతేకాదు అడవి జంతువుల రూపాలను కూడా ఏర్పాటుచేసారు. మొత్తంగా ఈ థీమ్ పార్క్ కు వెళితే మీ పిల్లలు బాగా ఎంజాయ్ చేయడమే మీరు కూడా పల్లెటూరి వాతావరణాన్ని ఫీల్ అవుతారు.
కుటుంబం మొత్తం రోజంతా హాయిగా గడిపేలా డైసీ డేల్ ఫార్మ్ పార్క్ ఆండ్ రిసార్ట్ ఏర్పాట్లు వున్నాయి. పిల్లలకు థ్రిల్లింగ్ గేమ్స్ తో పాటు జంతువులు, పక్షులతో సరదాగా గడిపే అవకాశం వుంటుంది. పిల్లలకు గుర్రపు స్వారీ అనుభూతిని కూడా పొందవచ్చు. ఇక్కడ మీ పిల్లలకు ఫోటోలు, వీడియోలు తీసేందుకు కూడా బ్యూటిఫుల్ స్పాట్స్ వున్నాయి...ముఖ్యంగా 'డిస్నీల్యాండ్' ను పోలిన నిర్మాణం తప్పకుండా ఆకట్టుకుంటుంది. అక్కడ మీ పిల్లలకు ఫోటోలు, వీడియోలు తీయడం వుండలేరు అనడంలో అతిశయోక్తి లేదు... అంత బాగుంటుంది.
ఇక ఇక్కడ లభించే రుచికరమైన ఫుడ్ ను పచ్చని ప్రకృతి అందాల మధ్య ఆస్వాదించవచ్చు. ఒక్కసారి ఇక్కడికి వెళితే మళ్లీమళ్లీ వెళ్లాలి అనేంతలా ఆకట్టుకుంటుంది. హైదరాబాద్ కు అతి దగ్గరలో వుండటం కూడా ఈ థీమ్ పార్క్ సక్సెస్ కు కలిసొచ్చిన మరో అంశం.