చారిత్రాత్మక నగరం హైదరాబాద్‌లో సందర్శనీయ గొప్ప ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ఆనాటి రాజులు పాలనా వైభవానికి నిదర్శనంగా నిలిచిన గోల్కొండ కోటే కాదు రాజవంశీకుల సమాధులు కూడా పర్యాటక ప్రదేశాలే. రామోజీ ఫిల్మ్ సిటీ, సాలార్ జంగ్ మ్యూజియం, బిర్లా టెంపులు, ట్యాంక్ బండ్... ఇలా అనేక పర్యాటక ప్రదేశాలకు హైదరాబాద్ నిలయం.
మక్కా మసీదు భారతదేశంలోని పురాతన, అతిపెద్ద మసీదులలో ఒకటి. దాని పక్కనే నిలువెత్తుగా నిలిచిన చార్మినార్, దానిచుట్టూ వెలిసిన చిరు వ్యాపారాలు అన్నీ చూడదగ్గవే. ఇలా హైదరాబాద్ లోని చరిత్ర, సంస్కృతిని తెెలియజేసే అనేక ప్రదేశాలున్నారు. ఇలా సెలవురోజు లేదంటే ఆదివారం ఇలావెళ్లి అలా తిరిగిరావచ్చు.