సీనియర్లను డమ్మీలు చేసిన కేసీఆర్: లోక్‌సభ సీట్లకు గండి

First Published May 24, 2019, 6:22 PM IST

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు చెందిన సీనియర్ల సేవలను సక్రమంగా వినియోగించుకోకపోవడం ఎంపీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.
 

తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేసింది. టీఆర్ఎస్ 9 ఎంపీ స్థానాలతోనే సరిపెట్టుకొంది. కనీసం 14 నుండి 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంటామని టీఆర్ఎస్ నేతలు భావించారు. కానీ, టీఆర్ఎస్‌ ఆశలను అడియాశలు చేశారు తెలంగాణ ఓటర్లు.తెలంగాణలో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంది. కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో గెలిచింది.
undefined
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించారు. మాజీ మంత్రి టీఆర్ఎస్ నేత హరీష్ రావు కేవలం మెదక్ పార్లమెంట్ స్థానానికే పరిమితం చేశారు.
undefined
నల్గొండ మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఈ దఫా టిక్కెట్టు ఇవ్వలేదు. సుఖేందర్ రెడ్డి పోటీ చేయడానికి విముఖంగా ఉన్నాడనే కారణంగా ఈ దఫా ఆయన స్థానంలో వేమిరెడ్డి నర్సింహ్మరెడ్డికి టిక్కెట్టు కేటాయించింది. సుఖేందర్ రెడ్డి మిర్యాలగూడ కేంద్రంగా ప్రచారం నిర్వహించినట్గుగా చెబుతున్నారు.
undefined
నల్గొండలో మాత్రం సుఖేందర్ రెడ్డి వీఐపీల ప్రచారంలో పాల్గొన్నట్టుగా చెబుతున్నారు. సుఖేందర్ రెడ్డికి టిక్కెట్టు ఇస్తే నల్గొండ ఎంపీ స్థానంలో విజయం నల్లేరుపై నడకేననే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
undefined
కేటీఆర్‌ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ వ్యవహరాలన్నీ తానే చూసుకొంటున్నారు. సీనియర్లు కేవలం సమావేశాలకే పరిమితమయ్యారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
undefined
నలుగురు సిట్టింగ్ ఎంపీలను టీఆర్ఎస్ మార్చింది. ఖమ్మంలో చివరి నిమిషంలో పార్టీలో చేరినా నామా నాగేశ్వర్ రావు విజయం సాధించారు.నామా నాగేశ్వరరావు గెలుపు కోసం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలకపాత్ర పోషించారు. ఈ స్థానంలో సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ టిక్కెట్టు ఇవ్వలేదు.
undefined
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడ నామా గెలుపు కోసం ప్రయత్నించారు. మహబూబ్‌నగర్ లో సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డికి టిక్కెట్టు నిరాకరించారు. దీంతో జితేందర్ రెడ్డి బీజేపీలో చేరారు. చేవేళ్ల ఎంపీ నియోజకవర్గ ఇంచార్జీ బాధ్యతలను కేటీఆర్ తీసుకొన్నారు.
undefined
ఈ స్థానంలో టీఆర్ఎస్ గెలుపు రౌండ్ రౌండ్‌కు దోబుచూలాడింది. ఎట్టకేలకు ఈ స్థానంలో టీఆర్ఎస్ గెలుచుకొంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. రంగారెడ్డి జిల్లాలోని పార్టీ నేతలతో విబేధాల కారణంగా విశ్వేశ్వర్ రెడ్డి గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు
undefined
ఎంపీల గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యేలు తీసుకోవాలని కేసీఆర్ చెప్పారు. కానీ, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఆశించిన ఫలితాలు మాత్రం దక్కలేదు. ఆయా జిల్లాల్లో నేతల మధ్య సమన్వయలోపం... అతి విశ్వాసం.. ప్రచారంలో ఒక వర్గంపై చేసిన ప్రచారం కూడ టీఆర్ఎస్‌ కొంపముంచిందనే భావన వ్యక్తమైంది.
undefined
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ నాయకత్వం వ్యవహరించిన తీరు కూడ ప్రజల్లో అసంతృప్తికి కారణంగా మారిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.మెదక్‌లో హరీష్‌రావుకు సవాల్ విసిరిన కేటీఆర్... ఆ సవాల్‌‌లో నెగ్గలేదు.
undefined
కరీంనగ్‌లో టీఆర్ఎస్ ఏకంగా ఓటమి పాలైంది. మెదక్ ఎంపీ స్థానాన్ని టీఆర్ఎస్ మూడు లక్షలకు పైగా మెజారిటీతో గెలుచుకొంది.గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చెందిన 26 మంది కీలక నేతల ఓటమి కోసం హరీష్‌ వ్యూహం ఫలించింది. ఈ దఫా మాత్రం కేటీఆర్ వ్యూహం ఫలించలేదు.
undefined
click me!