ఉత్తమ రికార్డు: అసెంబ్లీ వద్దంది, లోక్‌సభ రమ్మంది

First Published May 24, 2019, 3:09 PM IST

 అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ...ఎంపీ స్థానాలకు పోటీ చేసిన నేతలు  విజయం సాధించారు. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన రికార్డు మాత్రం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరున నెలకొంది.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో అంబర్ పేట నుండి కిషన్ రెడ్డి,కరీంనగర్ నుండి బండి సంజయ్ లు బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
undefined
కొడంగల్ నుండి రేవంత్ రెడ్డి, నల్గొండ నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, , చెన్నూరు నుండి వెంకటేష్,బోథ్ నుండి సోయం బాపూరావు కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఖమ్మం అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్ధిగా నామా పోటీ చేసి ఓడిపోయారు. కానీ , పార్లమెంట్ ఎన్నికల్లో వీరంతా విజయం సాధించారు.
undefined
కొడంగల్ నుండి గత ఎన్నికల్లో తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా ఈ స్థానంలో రేవంత్ నెగ్గారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గత నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుండి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి నెగ్గారు. టీఆర్ఎస్ అభ్యర్ధి మర్రి రాజశేఖర్ రెడ్డిపై విజయం సాధించారు.
undefined
నల్గొండ నుండి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి పాలయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ స్థానం నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.
undefined
2009 ఎన్నికల్లో ఈ స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు అసెంబ్లీ నుండి గెలిస్తే... నల్గొండ నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓడిపోయారు.
undefined
2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి బూర నర్సయ్య గౌడ్ చేతిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయాడు. ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో బూర నర్సయ్య గౌడ్ ఓటమి పాలయ్యారు.
undefined
2018 అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. గత నెలలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో సంజయ్ బీజేపీ అభ్యర్థిగా కరీంనగర్ నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఈ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధి వినోద్ కుమార్‌ను ఓడించి సంజయ్ నెగ్గారు.
undefined
గత అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన వెంకటేష్ ఓటమి పాలయ్యాడు. పార్లమెంట్ ఎన్నికలకు కొన్ని రోజులకు ముందే ఆయన టీఆర్ఎస్‌లో చేరారు.పెద్దపల్లి నుండి వెంకటేష్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి నెగ్గారు.
undefined
ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావు ఓడిపోయాడు.పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. ఖమ్మం ఎంపీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.బోథ్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన సోయం బాపూరావు ఓడారు. ఆదిలాబాద్ ఎంపీ స్థానం నుండి బాపూరావు బీజేపీ అభ్యర్థిగా నెగ్గారు.
undefined
ఇక అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడ పోటీ చేసి ఓటమి పాలైన వారు కూడ లేకపోలేదు. మాజీ మంత్రి డీకే అరుణ గత ఎన్నికల్లో గద్వాల అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆమె బీజేపీలో చేరారు. మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుండి పోటీ చేసి ఆమె ఓడిపోయారు.
undefined
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా రఘునందన్ రావు దుబ్బాక నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ దఫా ఆయన మెదక్ నుండి పోటీ చేసి మరోసారి ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.
undefined
మహబూబాబాద్ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు బీజేపీ అభ్యర్ధిగా హుస్సేన్ నాయక్ పోటీ చేసి ఓడారు. ఖానాపూర్ అసెంబ్లీకి, ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రమేష్ రాథోడ్ ఓడిపోయారు.మహాబూబాబాద్ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసిన బలరాం నాయక్ ఓడిపోయారు.జడ్చర్ల అసెంబ్లీ, నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన మల్లు రవి ఓడారు.
undefined
అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్‌ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. నల్గొండ నుండి ఎంపీకి పోటీ చేసిన ఉత్తమ్ విజయం సాధించి తన పట్టును నిలుపుకొన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా విజయం సాధించిన రికార్డు ఉత్తమ్‌దే.
undefined