టార్గెట్ 16 ఎంపీ సీట్లు: 9 మందికి కేసీఆర్‌ షాక్?

First Published Mar 10, 2019, 4:21 PM IST

రాష్ట్రంలోని  16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. అయితే సుమారు 9 స్థానాల్లో కొత్త అభ్యర్థులను  మార్చాలని కేసీఆర్ భావిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. అయితే సుమారు 9 స్థానాల్లో కొత్త అభ్యర్థులను మార్చాలని కేసీఆర్ భావిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
undefined
లోక్‌సభ ఎన్నికలను టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఇప్పటికే టీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
undefined
ఈ నెల 6వ తేదీన లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాల్లో పాల్గొంటున్నారు. నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, ఆదిలాబాద్,కరీంనగర్, వరంగల్, భువనగిరి పార్లమెంట్ స్థానాలపై టీఆర్ఎస్ నాయకత్వం స్పష్టత ఇచ్చినట్టు చెబుతున్నారు. పెద్దపల్లి నుండి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి.వివేక్‌ పేరుతో పాటు మరో పేరును కూడ పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఖమ్మం నుండి సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టిక్కెట్టుపై ఇంకా స్పష్టత రాలేదని చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలోని కమ్మ సామాజిక వర్గానికి సీటును కేటాయించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
undefined
మహబూబాబాద్ నుండి సీతారాం నాయక్‌ కాకుండా మాజీ ఎమ్మెల్యే కవిత పేరు కూడ ప్రచారంలో ఉంది. మహబూబ్‌నగర్ నుండి సిట్టింగ్ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డికి కాకుండా ఓ పారిశ్రామిక వేత్త సత్యనారాయణరెడ్డిని బరిలోకి దింపే అవకాశం ఉంటుంది. నాగర్‌కర్నూల్‌ లో టీడీపీ నుండి టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి పి.రాములు, మాజీ ఎంపీ మంద జగన్నాథంలలో ఒకరికి టిక్కెట్టు దక్కే అవకాశం ఉంది. మాజీ మంత్రి పి. రాములు వైపు టీఆర్ఎస్ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
undefined
నల్గొండ నుండి సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ స్థానం నుండి కేసీఆర్ కూడ పోటీ చేస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు. సుఖేందర్ రెడ్డి పోటీకి విముఖత చూపితే తేరా చిన్నపరెడ్డి లేదా ప్రముఖ బిల్డర్ వి. నర్సింహారెడ్డిని బరిలోకి దింపే అవకాశం ఉంది. మల్కాజిగిరి నుండి నవీన్‌రావు, చేవేళ్ల నుండి రంజిత్‌ రెడ్డి, సికింద్రాబాద్‌ నుండి మంత్రి తలసాని తనయుడు సాయి కిరణ్ పోటీ చేసే అవకాశం ఉంది.
undefined
నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి తిరిగి పోటీకి ఆసక్తి చూపకపోతే, తేరా చిన్నపరెడ్డి లేదా ప్రముఖ బిల్డర్‌ వేముగంటి నర్సింహారెడ్డిని బరిలో దించే ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఉందనే చర్చ జరుగుతోంది. మల్కాజిగిరి నుంచి పార్టీ నేత నవీన్‌రావు, చేవెళ్ల నుంచి పౌలీ్ట్ర పారిశ్రామికవేత్త రంజిత్‌రెడ్డి, సికింద్రాబాద్‌ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తనయుడు సాయికిరణ్‌ యాదవ్‌ టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేయటం ఖాయమనే ప్రచారం ఉంది. మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ స్థానాల్లో ఏదో ఒకటి దక్కుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్‌ ఆశలు పెట్టుకున్నారు.
undefined
చేవెళ్ల నుంచి మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి టిక్కెట్టు ఆశిస్తున్నారు. అయితే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుటుంబం కూడ టీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉంది. దీంతో ఈ స్థానం నుండి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి పేరు కూడ పరిశీలనలో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. శాసనమండలి ఛైర్మెన్ స్వామి గౌడ్‌కు ఈ స్థానం నుండి టిక్కెట్టు కేటాయించకపోవచ్చని చెబుతున్నారు.
undefined
click me!