జొమాటో యూజర్ల కోసం ప్రత్యేకమైన ఫీచర్.. ఇది ఏంటి, ఎం చేస్తుంది, ఎవరి కోసం అంటే..?

Published : Sep 02, 2023, 10:22 AM IST

జొమాటో  యువర్  'ఫుడీ బడ్డీ' అని పిలవబడే ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్  ఇప్పుడు  Zomato AIని లాంచ్ చేసింది.  "Zomato AI అనేది తెలివైన, సహజమైన ఆహార ప్రియుల సహచరుడు. వినియోగదారుల ఎప్పటికప్పుడు మారుతున్న ప్రాధాన్యతలు, ఆహార అవసరాలు ఇంకా  వారి ప్రస్తుత మనోభావాలను కూడా తీర్చడానికి రూపొందించబడింది" అని AI చాట్‌బాట్ గురించి కంపెనీ వివరించింది. Zomato AI వినియోగదారులకు కొత్త లెవెల్ పర్సనలైజేషన్  కూడా అందిస్తుందని తెలిపింది.  

PREV
13
జొమాటో యూజర్ల  కోసం ప్రత్యేకమైన ఫీచర్.. ఇది  ఏంటి, ఎం చేస్తుంది, ఎవరి కోసం అంటే..?

Zomato AIని ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి
Zomato AI అనేది ప్రత్యేకమైన యాప్ కాదు, Zomato యాప్‌లోని చాట్‌బాట్. కంపెనీ ప్రకారం,  యాప్ లేటెస్ట్  వెర్షన్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే, AI చాట్‌బాట్ Zomato AI ప్రత్యేకంగా Zomato గోల్డ్ కస్టమర్‌లకు అందుబాటులో ఉంది. జొమాటో గోల్డ్ అనేది కంపెనీ పెయిడ్ మెంబర్షిప్  గ్రేడ్. ఇంకా  వినియోగదారులకు ఫ్రీ డెలివరీలు, ఆన్ టైం గ్యారెంటీ, ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ఇతర బెనిఫిట్స్ ఆనందిస్తుంది. 

23

Zomato AI ఎం  చేస్తుంది
Zomato AI  ప్రత్యేక ఫీచర్ వివిధ పనుల కోసం వివిధ రకాల ప్రాంప్ట్‌లుగా క్లెయిమ్ చేయబడింది. జొమాటో  బ్లాగ్‌పోస్ట్‌లో వివరించినట్లుగా, “ఒక సరైన వంటకం కోసం ఆరాటపడుతున్నారా? Zomato AI మీకు విడ్జెట్‌ని అందజేస్తుంది, మీరు కోరుకున్న వంటకాన్ని అందించే అన్ని రెస్టారెంట్‌లను లిస్ట్ చేస్తుంది. ఎం ఆర్డర్ చేయాలో ఖచ్చితంగా తెలియదా ? ఎం ఇబ్బంది లేదు! Zomato AI మీ ఫుడ్ అప్షన్స్ తీసుకుంటూ పాపులర్  వంటకాలు లేదా రెస్టారెంట్ల లిస్ట్ సూచిస్తుంది.

33

అలాగే, Zomato AI 'నేచురల్ టెక్స్టింగ్ స్టైల్' అనే ఫీచర్‌కు సపోర్ట్ ఇస్తుంది, అంటే కస్టమర్‌లు రెస్టారెంట్‌లు ఇంకా ఒక ఖచ్చితమైన  వంటకాల కోసం మాత్రమే కాకుండా, "నేను బాగా ఆకలిగా ఉన్నప్పుడు  ఎం  తినాలి?" వంటి ప్రశ్నలకు సమాధానాలను కూడా ఇస్తుందని అర్థం లేదా "ప్రోటీన్లు ఎక్కువగా ఇంకా షుగర్  పదార్థాలు తక్కువగా ఉండే వాటిని నేను తినవచ్చా?" దీనర్థం కస్టమర్‌లు వారి ఆహార కోరికలకు పరిష్కారాలను పొందడమే కాకుండా వారికి  ఉండే ఇతర సాధారణ ఆహార సంబంధిత ప్రశ్నలకు సమాధానాలను కూడా పొందవచ్చు.

click me!

Recommended Stories