భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ సరైన విద్యుత్ కనెక్షన్ లేదు. మారుమూల గ్రామాలు కావడం లేక ఇతర కారణాలతో విద్యుత్ శాఖ విద్యుత్ సౌకర్యం కల్పించడం కూడా కష్టంగా ఉంటుంది. అందుకే కొన్ని ప్రదేశాలలో ఇప్పటికి అంధకారంలో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో హర్యానాకు చెందిన జజ్జర్ కుటుంబం ఒకటి, హర్యానాకు చెందిన జజ్జర్ కుటుంబం ఉండే ప్రదేశంలో విద్యుత్ కనెక్షన్ పొందలేదు. దీంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు ఓ కీలక నిర్ణయానికి వచ్చారు.
సొంతంగా కరెంటు తయారు చేసుకోవాలని ఆలోచన వేసి అందులో విజయం సాధించారు. వీరు విద్యుత్తును ఉత్పత్తి చేసి వినియోగించడమే కాకుండా విద్యుత్తును విక్రయిస్తున్నారు కూడా . కోడి రెట్టతో కరెంటును జజ్జర్ కుటుంబం తయారు చేస్తుందంటే నమ్మాల్సిందే. అంతేకాదు కోడి రెట్టల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు తేమను పారద్రోలడం, దుర్వాసన నుంచి ఉపశమనం వంటివి సాధించారు.
ఇళ్లు, ఇంటి పనులన్నీ ఈ కరెంటు నుంచే సాగుతున్నాయి. ప్రస్తుతం ఈ కుటుంబం కోడి రెట్టల నుంచి దాదాపు 50 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. పౌల్ట్రీ ఫారంలోనే విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన పరికరాలు అమర్చి 24 గంటల పాటు ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.