ఒక్కోసారి కారుని ఎక్కడ పార్క్ చేసామో దొరకదు. దీని సహాయంతో నిమిషాల వ్యవధిలో పార్క్ చేసిన వాహనాన్ని గుర్తించవచ్చు.
Google Mapsను ఉపయోగించి పార్క్ చేసిన వాహనాన్ని గుర్తించడానికి, మీరు ముందుగా పార్కింగ్ లొకేషన్ మ్యాప్‌లో సేవ్ చేయాలి. దీని కోసం, మీరు ముందుగా Google యాప్‌ని తెరిచి ఆపై ప్రస్తుత లొకేషన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు బ్లూ టిక్ కనిపిస్తుంది.
దానిపై క్లిక్ చేయండి, మీ లొకేషన్ సేవ్ చేసే అప్షన్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఫోటో అండ్ వాహన రిజిస్ట్రేషన్ నంబర్ మొదలైనవాటిని ఎంటర్ చేయవచ్చు. Google Maps లేటెస్ట్ వెర్షన్ తప్పనిసరిగా మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసి ఉండాలి.
ఇందుకు మీ ఫోన్‌లో లొకేషన్ తప్పనిసరిగా ఎనేబుల్ చేసి ఉండాలి. ఇంకా స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో లేదా అంతకంటే పై రన్ అవుతుందని నిర్ధారించుకోండి.