సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా జూలై 2023లో 'థ్రెడ్స్' అనే యాప్‌ను లాంచ్ చేసింది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను సొంతం చేసుకున్న మెటా.. ట్విట్టర్‌కు పోటీగా 'థ్రెడ్స్' యాప్‌ను విడుదల చేసింది.
విడుదలైన ఐదు రోజుల్లోనే 'థ్రెడ్స్' యాప్ 10 కోట్ల మంది యూజర్లను చేరి రికార్డు సృష్టించింది. అయితే, ఆగస్టు నాటికి, డైలీ యూజర్స్ సంఖ్య 80% తగ్గింది. ‘థ్రెడ్స్’ యాప్‌ను వినియోగించే సమయం కూడా తగ్గినట్లు సమాచారం. జూలైలో వినియోగదారులు సగటున రోజులు 21 నిమిషాలు థ్రెడ్స్ యాప్ లో గడిపారు, అయితే నవంబర్‌లో కేవలం మూడు నిమిషాలకు పడిపోయింది.
ఈ నేపథ్యంలో TRG డేటాసెంటర్లు ఈ సంవత్సరం వినియోగదారుల అసంతృప్తిని పొందిన మొబైల్ అప్లికేషన్‌లను కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన 9 సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లను సెలెక్ట్ చేసుకొని పరిశోధన ప్రారంభించారు. గత 12 నెలల్లో అకౌంట్ ను ఎలా డిలేట్ చేయాలో వెతికిన వినియోగదారుల సంఖ్యను వెలికి తీసింది. నెలకు సగటు సర్చ్ సంఖ్యను విశ్లేషించినట్లు తెలిపింది.
Apps
దీని ప్రకారం, ఎక్కువ మంది వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తొలగించాలనుకుంటున్నట్లు వెల్లడించింది. TRG ప్రకారం, 10 లక్షల మందికి పైగా వినియోగదారులు 'నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఎలా తొలగించాలి' (how to delete my instagram account )అని సెర్చ్ చేసారు. ఇన్‌స్టాగ్రామ్‌కు ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు. అయితే ప్రతి నెలా 10 లక్షల మంది వారి అకౌంట్లను డిలీట్ చేస్తే ఏడాదిలో భారీగా తగ్గుముఖం పడుతుందని టీఆర్‌జీ నివేదిక చెబుతోంది.
ఇన్‌స్టాగ్రామ్‌ను స్నాప్‌చాట్ అనుసరిస్తోంది, ఇప్పుడు వినియోగదారుల నుండి ఎక్కువ అసంతృప్తి పొందిన మరో యాప్ స్నాప్‌చాట్. ఈ సంవత్సరం ప్రతి నెలా దాదాపు 130,000 మంది వారి స్నాప్‌చాట్ అకౌంట్ డిలేట్ చేయడానికి ప్రయత్నించారు. ఇన్‌స్టాగ్రామ్ కంటే ఈ సంఖ్య గణనీయంగా తక్కువగా ఉన్నప్పటికీ, దాని మొత్తం యూజర్ బేస్ (7.5 కోట్లు)లో ఎక్కువ భాగం.