తప్పుగా డబ్బు పంపించారా.. 48 గంటల్లో రీఫండ్.. ఎలాగో తెలుసా?

First Published | Dec 13, 2023, 6:52 PM IST

నేటి డిజిటల్ పేమెంట్  ప్రపంచంలో డబ్బును పంపించడానికి  UPI ఒక సాధారణ ప్రక్రియ. UPIతో ఎక్కువ మంది ఇప్పుడు పేమెంట్స్ చేస్తున్నారు, ఎందుకంటే  సెకన్లలో డబ్బును బదిలీ చేయవచ్చు. Google Pay, Phone Pay, Paytm వంటి అనేక UPI యాప్‌లు వాడుకలో ఉన్నాయి. 

అయితే, కొన్నిసార్లు UPI ద్వారా డబ్బు పంపేటప్పుడు తప్పు వ్యక్తికి పంపబడుతుంది. అప్పుడు ఏం చేయాలో తెలియక చాలా మంది ఆందోళన చెందుతుంటారు. అయితే మీరు సమయానికి రిపోర్ట్ చేస్తే మీ డబ్బును తిరిగి పొందవచ్చు.

మీరు UPI ద్వారా తప్పుడు బ్యాంక్ అకౌంట్ లేదా నంబర్ కి డబ్బు పంపితే మీరు రిపోర్టింగ్ చేసిన 2 వర్కింగ్ డేస్  లేదా 48 గంటలలోపు డబ్బును తిరిగి పొందవచ్చని RBI తెలిపింది.  UPI ద్వారా తప్పుగా పంపిన డబ్బును తిరిగి పొందడంలో మీకు సహాయపడే కొన్ని  మార్గాలు ఇక్కడ చూడవచ్చు.
 

హెల్ప్‌లైన్ నంబర్‌ సంప్రదించండి

మీరు తప్పు నంబర్‌కు డబ్బు  పంపినట్లయితే  మీరు ముందుగా పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌(Google Pay, Phone Pay, Paytm)లోని హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి మీ ఫిర్యాదును రిజిస్టర్  చేయాలి.

పాపులర్ పేమెంట్  ప్లాట్‌ఫారమ్‌ల ఫిర్యాదు హెల్ప్‌లైన్ నంబర్‌లు

ఫోన్ పే హెల్ప్‌లైన్ నెంబర్-1800-419-0157
Google Pay హెల్ప్‌లైన్ నెంబర్- 080-68727374 / 022-68727374
Paytm హెల్ప్‌లైన్ నెంబర్- 0120-4456-456
BHIM హెల్ప్‌లైన్ నంబర్- 18001201740, 4047
 

Latest Videos


NPCIకి ఫిర్యాదు చేయవచ్చు

దీని తర్వాత మీరు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెబ్‌సైట్‌ను సందర్శించి ఫిర్యాదును ఫైల్ చేయవచ్చు. ఆ తర్వాత మీరు వెంటనే మీ బ్యాంకుకు రిపోర్ట్ చేయాలి.

ఫిర్యాదు చేయడం ఎలా?

ముందుగా మీరు చెల్లించిన UPI సైట్  హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి. అడిగిన మొత్తం సమాచారం ఇవ్వండి. దీని తర్వాత  నంబర్ (మీరు తప్పుగా డబ్బు పంపిన నంబర్) వంటి లావాదేవీకి సంబంధించిన అన్ని వివరాలను నింపండి అండ్ మీ బ్యాంక్‌లో ఫిర్యాదు చేయండి.

సరైన సమయంలోగా బ్యాంక్ మీ రీఫండ్ ప్రక్రియను పూర్తి చేయకపోతే, మీరు బ్యాంక్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కంప్లైంట్  గురించి లోక్‌పాల్‌కి ఫిర్యాదు చేయవచ్చు.

ఫిర్యాదు ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీ లావాదేవీ ధృవీకరించబడుతుంది. మీ డబ్బు 2 నుండి 3 పని రోజులలోపు తిరిగి చెల్లించబడుతుంది.

తప్పు నంబర్ వ్యక్తిని సంప్రదించండి: మీరు Paytm అండ్ GPay వంటి UPI యాప్‌లలో టెక్స్ట్ మెసేజింగ్ ద్వారా రిసీవర్ ని సంప్రదించవచ్చు ఇంకా  తప్పుగా పంపిన డబ్బు గురించి మెసేజ్ చేయవచ్చు లేదా డబ్బును తిరిగి ఇవ్వమని వారిని అడగవచ్చు.  

click me!