ఇంటర్నెట్ లేకుండా కూడా డబ్బు పంపవచ్చు.. ఈ నంబర్ ఉంటే చాలు..

First Published | May 14, 2024, 5:46 PM IST

ఇప్పుడు మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా ఇతరులకు డబ్బు ట్రాన్స్ఫర్  చేయవచ్చు. అవును నిజమే.. ఎలా అని అనుకుంటున్నారా.. ?
 

సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. గతంలో ఎవరికైనా డబ్బులు పంపాలంటే బ్యాంకుకు వెళ్లి అకౌంట్ ద్వారా పంపించాల్సి వచ్చేది.
 

ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ఆ సేవలన్నీ ఇంటి వద్దనే జరిగిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉండటం వల్ల  బ్యాంకింగ్ లావాదేవీలు  ఈజీగా చేయవచ్చు. ఇంకా UPI పేమెంట్స్  ఈ రోజుల్లో చాలా మందికి అవసరంగా మారాయి.
 

Latest Videos


ప్రజలు ఏదైనా  కొన్నప్పుడు UPI పేమెంట్ ఉపయోగిస్తారు. UPI వినియోగదారులు ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకపోవడం వల్ల ఒకోసారి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా కూడా UPI సేవలను ఉపయోగించవచ్చు.

ఈ సర్వీస్ ఎలా పనిచేస్తుందో చూద్దాం... మీ స్మార్ట్‌ఫోన్‌లో 080 4516 3666కు డయల్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్  తో అనుబంధించబడిన అదే ఫోన్ నంబర్‌ను ఉపయోగించి మీ బ్యాంక్ అకౌంట్ ఎంటర్  చేయండి.

మీ డెబిట్ కార్డ్ చివరి 6 అంకెలు, వాలిడిటీ తేదీని సెట్ చేసిన తర్వాత, మీరు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా UPI పేమెంట్స్  చేయవచ్చు. ఇందుకు మీ మొబైల్‌లో 080 4516 3666కు డయల్ చేయండి.
 

మీరు డబ్బు పంపాలనుకుంటున్న వ్యక్తి   UPI ID/ఫోన్ నంబర్/బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను కూడా ఎంటర్ చేయండి. ఇప్పుడు UPI పిన్‌ని ఎంటర్  చేయండి. ఈ సర్వీస్ ద్వారా రూ.5,000  వరకు పంపవచ్చు.
 

click me!