రూ.35వేలలోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. 5జి, లేటెస్ట్ ఫీచర్స్ ఇంకా మరెన్నో..

First Published | May 14, 2024, 4:16 PM IST

ఇండియన్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో  రోజుకో కొత్త ఫోన్ పుట్టుకొస్తున్నాయి. చాలామంది ఎవరి అవసరానికి, వినియోగానికి వారు స్మార్ట్ ఫోన్స్ కొంటుంటారు. మీరు ఈ నెలలో రూ. 35,000లోపు  ఉన్న బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ కోసం చూస్తున్నారా... అయితే  వాటి ధరలు, ఫీచర్స్ మీకోసం... .
 

OnePlus 11R 5G 8+ Gen 1 Plus ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ గేమర్స్ ఇంకా మల్టీ టాస్క్ అవసరాలను తీరుస్తుంది. మీరు హై    గ్రాఫిక్స్‌లో BGMIని ప్లే చేయవచ్చు. 120Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. దీని వెనుక భాగంలో మంచి ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. అలాగే 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ లభిస్తుంది.
 

iQoo Neo 9 Pro 5G స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్ ద్వారా వస్తుంది.  క్లాస్-లీడింగ్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇందులో 50 MP మెయిన్ సెన్సార్, 5,160mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఇంకా ఎన్నో  ఇతర ఫీచర్లు ఉన్నాయి.  30 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్ అవుతుంది. సూపర్‌ఫాస్ట్ 120W ఛార్జింగ్ సౌకర్యం కోరుకునే వారు ఖచ్చితంగా iQOO Neo 9 Proని   సెలెక్ట్ చేసుకోవచ్చు.
 


Redmi Note 13 Pro Plus 5G, MediaTek Dimensity 7200 Ultra chipset ద్వారా  రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే, OISతో 200MP ప్రైమరీ రియర్ కెమెరాతో వస్తుంది. 5000mAh బ్యాటరీ ఖచ్చితంగా పవర్‌హౌస్‌గా ఉంటుంది. ఒక్క ఫుల్ ఛార్జ్ ఈజీగా రోజంతా ఉంటుంది. ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది.
 

Poco F5 12-బిట్ AMOLED డిస్‌ప్లే, సాఫ్ట్  120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్  గేమింగ్ ఇంకా  మల్టి అప్లికేషన్‌లను ఏకకాలంలో రన్  చేయడం వంటి  పనులను చేస్తుంది.  67W ఫాస్ట్ ఛార్జింగ్, 5,000mAh బ్యాటరీ, 64MP ప్రైమరీ OIS స్నాపర్‌తో కూడిన కెమెరా సెటప్‌తో వస్తుంది.
 

Latest Videos

click me!