సూపర్ స్పీడ్ ఛార్జింగ్.. లేటెస్ట్ ప్రాసెసర్.. ఈ మోటరోల ఫోన్ అమేజింగ్..

First Published | May 10, 2024, 12:41 PM IST

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త  కొత్త మోడల్స్ ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే  లెనోవా  యాజమాన్యంలోని మోటరోల ఒక కొత్త మొబైల్‌ను  పరిచయం చేయనుంది. అదే Motorola Edge 50 Fusion.
 

Motorola Edge 50 Fusionలో 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్, Snapdragon 7S Gen 2 అందించారు.
 

Motorola Edge 50 Fusion మే 16న మధ్యాహ్నం 12:00 గంటలకు Flipkart ద్వారా సేల్స్ స్టార్ట్ అవుతాయి. మోటరోల  అధికారిక ట్విట్టర్ పేజీలో ఈ మొబైల్ గురించి టీజర్స్ కూడా లాంచ్  చేసింది.
 


బ్లూ, పింక్ అనే రెండు కలర్ వేరియంట్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్  లభిస్తుంది.  ఇంకా 12GB RAM, Android 14-Hello UIతో వస్తుంది.
 

Motorola Edge 50 Fusion ఫోన్‌లో 6.7-అంగుళాల pOLED డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్  ఉంటుంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్ డిస్‌ప్లేపై అందించారు.
 

Motorola Edge 50 Fusion వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో 50MP Sony LYTIA 700C సెన్సార్, 13-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ మాక్రో షూటర్‌ ఉంది. ఇంకా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఇచ్చారు.
 

Latest Videos

click me!