వాట్సాప్ లో ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్.. ఇప్పుడు మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయవచ్చు..

First Published Aug 1, 2024, 12:56 PM IST

ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ 'రీషేర్ స్టేటస్ అప్‌డేట్' అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసేందుకు  సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ కొత్త ఫీచర్ ప్రాసెసింగ్లో  ఉన్నట్లు తెలుస్తోంది.

ఇతరుల స్టేటస్ అప్‌డేట్‌లను షేర్ చేయడంలో ఇన్‌స్టాగ్రామ్ తరహాలోనే వాట్సాప్ కూడా ఒక ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటి వరకు స్టేటస్ అప్‌డేట్‌లలో ఇతరుల స్టేటస్‌ల స్క్రీన్‌షాట్‌లను మాత్రమే షేర్ చేయడానికి ఉండేది.  
 

Wabetinfo బ్లాగ్ పోస్ట్‌లో 'రీ-షేర్ స్టేటస్ అప్‌డేట్' ఫీచర్ యూజర్లు స్టేటస్ అప్‌డేట్‌లను రిషేర్ చేయడంలో సహాయపడుతుందని పేర్కొంది. కొత్త అప్‌డేట్‌తో యూజర్లు వారి కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారితో ఇతరుల స్టేటస్‌లను షేర్ చేయవచ్చు.
 

Latest Videos


'రీషేర్ స్టేటస్ అప్‌డేట్స్' పేరుతో వస్తున్న కొత్త ఫీచర్ మీరు పంపించాలనుకున్న స్టేటస్  షేర్  చేసే ప్రక్రియను ఈజీ  చేయడానికి రూపొందించారు. కొత్త ఫీచర్ అప్‌డేట్‌ తో ఏదైనా స్టేటస్‌ మీ కాంటాక్ట్స్ కి మళ్లీ షేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీని ద్వారా కంటెంట్ ఎక్కువ మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది. 

Wabetinfo నివేదిక ప్రకారం, కొత్త ఫీచర్ తీసుకొచ్చాక దీని కోసం ఒక కొత్త బటన్ స్టేటస్ అప్ డేట్ ఇంటర్‌ఫేస్‌లో చేర్చవచ్చు. ఈ బటన్ స్టేటస్ అప్‌డేట్‌లను మళ్లీ షేర్ చేయడాన్ని ఈజీ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.  

click me!