కేవలం 15 రోజుల్లో ఇన్ని లక్షల BSNL సిమ్‌లు అమ్ముడయ్యాయా..?

First Published Aug 1, 2024, 12:55 PM IST

కేవలం 15 రోజుల్లో ఎన్ని లక్షల BSNL సిమ్‌లు అమ్ముడయ్యాయో తెలుసా ? భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అనేది ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికమ్యూనికేషన్ కంపెనీ. 

ఈ కంపెనీ  చాలా సంవత్సరాలుగా టెలికమ్యూనికేషన్ సేవలు అందిస్తోంది. ఇటీవలి కాలంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు ఆదరణ పెరిగింది. కానీ కస్టమర్లను తిరిగి BSNL వైపు తిప్పుకునే ధోరణి  కంపెనీ పెంచింది.

దేశంలోని అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఇటీవల రీఛార్జ్ ప్లాన్‌లను మార్చింది. దీంతో రీఛార్జ్ ప్లాన్ ధర 12.5 శాతం నుంచి 25 శాతానికి పెరిగింది. అలాగే ఎయిర్‌టెల్, వొడాఫోన్ లాంటి టెలికాం కంపెనీలు కూడా ధరలను పెంచాయి. ధరల పెంపుతో కస్టమర్లు  ఆలోచనలో పడ్డారు. 
 

Latest Videos


ధరల పెంపు తర్వాత, చాలా మంది కస్టమర్లు జియో నుంచి మారాలని భావించారు. దీనికి ప్రత్యామ్నాయం ఏమిటనే చర్చ సోషల్ మీడియాలోనూ మొదలైంది. అందులో BSNL పేరు ముందుంది. చాలా మంది నంబర్‌ను పోర్ట్ ద్వారా  BSNLకి మారాలని అనుకున్నారు. ప్రైవేట్ టెలికాం కంపెనీల టారిఫ్ ప్లాన్‌ల పెంపు కారణంగా ప్రజలు ఇప్పుడు  BSNL వైపు మొగ్గు చూపుతున్నారు.
 

అయితే సర్వీస్ పరంగా ప్రైవేట్ టెల్కోల కంటే BSNL చాలా వెనుకబడి ఉంది. ప్రైవేట్ కంపెనీలు 5జీ సేవలను అందిస్తుండగా, బీఎస్ఎన్ఎల్ మాత్రం 4జీ సేవలను అందిస్తోంది. అయితే ఒకప్పుడు BSNL దేశంలోనే అగ్రగామి టెలికాం కంపెనీ. కస్టమర్ల సంఖ్య కూడా ఎక్కువే.
 

దాదాపు 20-25 ఏళ్ల క్రితం టెలికాం మార్కెట్‌లో BSNL వాటా 18 శాతానికి పైగా ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ప్రైవేట్ కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచడంతో ఇపుడు ప్రజల చూపు BSNL వైపు  పడింది. నివేదికల ప్రకారం, జూలై నుండి 15 రోజుల్లో 15 లక్షల మందికి పైగా ప్రజలు BSNL కనెక్షన్లు తీసుకున్నారు.
 

click me!