ఇల్లు, ఆఫీస్ సహా అన్ని అవసరాలకు ఇదిగో.. వన్ ప్లస్ ప్యాడ్ 2 వచ్చేసింది !

First Published | Jul 31, 2024, 6:39 PM IST

లేటెస్ట్ వన్ ప్లస్ ప్యాడ్ 2 తాజాగా లాంచ్ అయింది. ఈ వన్ ప్లస్ ప్యాడ్ 2 ఇల్లు, ఆఫీస్, ప్రయాణం, ఫోటోగ్రఫీతో సహా అన్ని అవసరాలకు సరిపోతుంది. అలాగే, వన్ ప్లేస్ ఈ ప్యాడ్‌ను మంచి ధరకు తీసుకువచ్చింది.
 

డెస్క్‌టాప్‌లు పోయి ల్యాప్‌టాప్‌ల యుగం ప్రారంభమైన తర్వాత నోట్‌బుక్‌& టాబ్లెట్‌ల యుగం వచ్చేసింది. Samsung tablet, iPadలు కొంతకాలం క్రితం పాపులర్ అయ్యాయి. కొత్త కొత్త  కంపెనీలు కూడా  టాబ్లెట్‌లను తీసుకొచ్చాయి. చాలా ఏళ్ల తర్వాత మార్కెట్లోకి వచ్చిన OnePlus.. ట్యాబ్లెట్ల ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టింది. ఇప్పుడు OnePlus Pad 2 మార్కెట్లోకి వచ్చేసింది. 2023లో OnePlus ప్యాడ్ మార్కెట్లోకి వచ్చినప్పుడు బెస్ట్ Android ట్యాబ్‌గా పిలిచారు. ఇప్పుడు దానికంటే బెస్ట్  టాబ్లెట్‌ వచ్చేసింది.
 

OnePlus దీనిని నెక్స్ట్  జనరేషన్ ఫ్లాగ్‌షిప్ టాబ్లెట్‌గా వివరించింది. పెర్ఫామెన్స్, లుక్స్, ఆడియో, ఏఐ- ఇలా అన్నీ సన్నటి పలకపై కలిస్తే ఎలా ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానం ఇది. Snapdragon 8, Gen 3తో  అత్యంత అధునాతన AI దీనిలో ఉంది. 3K డిస్‌ప్లే, 6-స్పీకర్ ఆడియో, స్టైలో 2 & కీబోర్డ్‌తో – ఇది ల్యాప్‌టాప్‌కు దగ్గరగా ఉంటుంది.
 

Latest Videos


దీని ఫీచర్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. పెద్ద స్క్రీన్, సాఫ్ట్ కనెక్టివిటీ, పవర్ ఫుల్  పర్ఫార్మెన్స్, AI ప్రయోజనాలు, అద్భుతమైన విజువల్స్, ఆకర్షణీయమైన ఆడియో, బెస్ట్ గేమింగ్ మోడ్- మీకు ఇంకా ఏమి కావాలి చెప్పండి.... అయితే ఇలాంటి టాబ్లెట్లలో బ్యాటరీ లైఫ్ & ఫాస్ట్ ఛార్జింగ్ అవసరం. దీని 9510 mAh బ్యాటరీ 43 రోజుల స్టాండ్‌బై టైం  ఉంటుంది. అంటే ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఐదు వారాల పాటు టచ్ చేయకపోయినా బ్యాటరీ అయిపోదు. దీనితో వచ్చే 67 వాట్ ఛార్జర్ ద్వారా పది నిమిషాలకు 23%, 30 నిమిషాలకు 64% ఛార్జ్ చేయవచ్చు. 13 మెగాపిక్సెల్ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరాతో మీరు ఫోటోలు తీయవచ్చు, వీడియో కాల్స్ చేయవచ్చు, మీటింగ్స్ హాజరు కావచ్చు ఇంకా ఎక్కడైనా కూర్చుని మాట్లాడుకోవచ్చు, వర్క్ చేయవచ్చు. 500grams బరువు, 6.49mm స్లిమ్, చేతికి తేలికగా, కళ్లకు తేలికగా ఉంటుంది.

ఈ టాబ్లెట్‌ స్మార్ట్ కీబోర్డ్‌తో కూడా స్టయిల్ గా కూడా ఉంటుంది. మీరు వ్రాయవచ్చు, నోట్స్ తీసుకోవచ్చు, దీన్ని నోట్‌బుక్‌గా ఉపయోగించవచ్చు. అన్నింటి కంటే అన్ని ఫైళ్లను సింక్ చేయవచ్చు ఇంకా ఎక్కడికైనా తీసుకువెళ్లవచ్చు. దీన్ని మీ మొబైల్ ఆఫీస్ గా  భావించవచ్చు. దీని ధర రూ.39,999.

click me!