48 ఎంపీ కెమెరాతో షియోమి ఎం‌ఐ కొత్త టీవీ.. వై-ఫై, బ్లూటూత్ తో లేటెస్ట్ అండ్రాయిడ్ ఫీచర్స్ కూడా..

First Published | Jun 29, 2021, 7:52 PM IST

ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ షియోమి  రెండు స్మార్ట్ టీవీలను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది, వీటిలో ఎం‌ఐ  టివి 6 ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్, ఎం‌ఐ టివి ఇఎస్ 2022 ఉన్నాయి. ఈ రెండు టీవీలలో  భిన్నమైన ఫీచర్స్ అందించారు. 

ఎం‌ఐ టివి 6 ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్‌లో 3డి ఎల్‌యుటి ఫిల్మ్ ఇండస్ట్రియల్ గ్రేడ్ కలర్ కరెక్షన్‌తో మీడియాటెక్ ఎమ్‌టి 9950 ప్రాసెసర్ ఇచ్చారు. ఈ టీవీలో డ్యూయల్ కెమెరా సెటప్ కూడా ఉంది, దీని లెన్స్ 48 మెగాపిక్సెల్స్. మరోవైపు ఎం‌ఐ టీవీ ఇఎస్ 2022లో మీడియాటెక్ MT9638 ప్రాసెసర్‌తో డ్యూయల్ ఛానల్ 12.5W నాలుగు స్పీకర్లు అందించారు.
undefined
ధరఎం‌ఐ టివి 6 ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్ ధర 5,999 చైనీస్ యువాన్ అంటే సుమారు రూ.68,900. ఈ ధర 55 అంగుళాల మోడల్ కోసం. అలాగే 65-అంగుళాల మోడల్ ధర 7,999 చైనీస్ యువాన్ అంటే సుమారు రూ.91,900. 75 అంగుళాల మోడల్ ధర 9,999 చైనీస్ యువాన్ అంటే సుమారు రూ.1,14,800. ఎం‌ఐ టివి ఈ‌ఎస్ 2022 ప్రారంభ ధర 3,399 చైనీస్ యువాన్ అంటే సుమారు రూ.39,000.
undefined

Latest Videos


ఎం‌ఐ టివి 6 ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్ స్పెసిఫికేషన్లుఎం‌ఐ టివి 6 ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్ స్లిమ్ టీవీ. దీనికి మీడియాటెక్ MT9950 ప్రాసెసర్‌తో 4.5జి‌బి ర్యామ్, 64జి‌బి స్టోరేజ్ ఇచ్చారు. దీని డిస్ ప్లే 4కే క్యూ‌ఎల్‌ఈ‌డి, దీని బ్రైట్ నెస్ 1,200 నిట్స్. దీని రిఫ్రెష్ రేటు 120 హెర్ట్జ్. అలాగే 100W ఆడియో సిస్టమ్, 48 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ అందించారు. దీని బాడీ మొత్తం లోహంతో తయారవుతుంది. కనెక్టివిటీ కోసం దీనికి HDMI 2.1 + VRR సపోర్ట్ తో డాల్బీ విజన్‌ సపోర్ట్ ఉంది. ఈ టీవీ 55 అంగుళాల, 65 అంగుళాల మోడళ్లు బ్యాక్‌లైట్‌తో వస్తాయి.
undefined
ఎం‌ఐ టివి ఈ‌ఎస్ 2022 ఫీచర్స్ఎం‌ఐ టివి ఇఎస్ 2022లో మల్టీజోన్ బ్యాక్‌లైట్ సిస్టం ఉంది. దీనికి మీడియాటెక్ MT9638 ప్రాసెసర్, హెచ్‌డి‌ఆర్ 10 ప్లస్, డ్యూయల్-ఛానల్ 12.5W ఫోర్-యూనిట్ స్పీకర్ స్టీరియో ప్లేబ్యాక్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే జియావోఏఐ వాయిస్ అసిస్టెంట్, 2 జిబి ర్యామ్‌తో 32 జిబి స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. కనెక్టివిటీ కోసం 3 HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లు, ఒక AV పోర్ట్, ATVDTMB, Wi-Fi, బ్లూటూత్ v5 తో SPDIF ఇన్‌పుట్‌ ఉంటుంది.
undefined
click me!