మొబైల్ అండ్ డెస్క్‌టాప్ వినియోగదారులు ఈ కొత్త టెలిగ్రామ్ అప్ డేట్ ను ఉపయోగించుయికోవచ్చు. టెలిగ్రామ్ గ్రూప్ వీడియో కాలింగ్ ఫేస్ బుక్ మెసెంజర్, వాట్సాప్, ఆపిల్ ఫేస్ టైమ్ లతో పోటీపడుతుంది.
టెలిగ్రామ్ గ్రూప్ వీడియో కాల్‌లో వినియోగదారులకు యానిమేటెడ్ బ్యాక్ గ్రౌండ్స్ ఇంకా యానిమేటెడ్ ఎమోజీలకు కూడా సపోర్ట్ లభిస్తుంది. కొత్త అప్ డేట్ లో బాట్స్ కోసం ప్రత్యేకమైన మెను ఉంటుంది.
టెలిగ్రామ్ ఈ కొత్త అప్ డేట్ లో మరొక ఫీచర్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేంటంటే మీరు మీ గ్రూప్ ఆడియో కాల్స్ ని వీడియో కాల్స్ గా మార్చవచ్చు. దీని కోసం వినియోగదారులు ఆడియో కాలింగ్ సమయంలో కెమెరా సింబల్ పై క్లిక్ చేయాలి. వీడియో కాల్ ప్రారంభమైన తర్వాత మీరు గ్రూప్ సభ్యులని పిన్ చేయవచ్చు. పిన్ చేసిన తరువాత మీరు గ్రూప్ సభ్యుల వీడియోలను చూడవచ్చు. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే టెలిగ్రామ్ స్క్రీన్ షేర్ ఆప్షన్ ను కూడా ఇచ్చింది.
టాబ్లెట్ అండ్ డెస్క్‌టాప్ వినియోగదారులకు వీడియో కాల్స్ కి ప్రత్యేక సపోర్ట్ లభిస్తుంది. స్ప్లిట్ స్క్రీన్ కూడా వారి కోసం ప్రత్యేకంగా రూపొందించారు. డెస్క్‌టాప్ వినియోగదారులు ఒకే ప్రోగ్రామ్ స్క్రీన్‌ను షేర్ చేయవచ్చు. అలాగే గ్రూప్ సభ్యులు డెస్క్‌టాప్‌లో ఉన్నప్పుడు స్క్రీన్‌ను షేర్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా పిన్ చేయబడుతుంది.అంతేకాదు టెలిగ్రామ్ వినియోగదారులు ఇప్పుడు ఆన్ లిమిటెడ్ సభ్యులతో గ్రూప్ వాయిస్ కాల్స్ చేయవచ్చు. ఇప్పటి వరకు గ్రూప్ వాయిస్ కాల్‌లో 30 మంది వరకు మాత్రమే ఆప్షన్ ఉండేది. గత ఏడాది ఏప్రిల్‌లో టెలిగ్రామ్ గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను తీసుకువస్తున్నట్లు తెలిపింది.