వాట్సాప్ యుజర్లకు షాకింగ్ న్యూస్.. ఇకపై ఆ ఫీచర్ కనిపించదు..

First Published | Jun 29, 2021, 6:19 PM IST

ఎండ్-టు-ఎండ్ ఎంక్రిప్షన్ తో ప్రపంచంలోనే అతిపెద్ద  ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్  ఎప్పటికప్పుడు  లేటెస్ట్ ఫీచర్లను తీసుకొస్తుంటుంది. అయితే వాట్సాప్ మొదట ఏదైనా ఫీచర్ ని బీటా వెర్షన్‌లో విడుదల చేస్తుంది. 

తరువాత అందరికీ అందుబాటులోకి తెస్తుంది. ఆన్‌లైన్ స్టేటస్ కి సంబంధించి వాట్సాప్ బీటా వెర్షన్‌లో మరో ఫీచర్ ఇప్పుడు టెస్టింగ్ చేస్తుంది. వాట్సాప్ బిజినెస్ యాప్‌లో కొత్త అప్ డేట్ తరువాత ఆన్‌లైన్ స్టేటస్ ఇక కనిపించదు. సాధారణంగా మీరు ఎవరైనా వాట్సాప్ యూజర్‌తో చాట్ చేస్తున్నప్పుడు వారి స్టేటస్ ఆన్‌లైన్‌ అని చూపిస్తుంది, కాని కొత్త అప్‌డేట్ తర్వాత ఈ ఫీచర్ వాట్సాప్ బిజినెస్ ఖాతాకి కనిపించదు.
కొత్త ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో టెస్ట్ చేస్తున్నారు. 2018 సంవత్సరంలో, వాట్సాప్ బిజినెస్ యాప్‌ను లాంచ్ చేసింది, అప్పుడే ఆన్‌లైన్ స్టేటస్ ఫీచర్‌ను కూడా యాప్‌లో చేర్చారు, కానీ ఇప్పుడు అంటే మూడేళ్ల తర్వాత దాన్ని తొలగించడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. వాట్సాప్ ఈ కొత్త అప్ డేట్ గురించి WABetaInfo సమాచారం ఇచ్చింది.

WABetaInfo ప్రకారం, ఈ ఫీచర్ వాట్సాప్ బిజినెస్ యాప్ అండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.21.13.17లో చూడవచ్చు. ఈ అప్ డేట్ తర్వాత వాట్సాప్ బిజినెస్ అక్కౌంట్ ఉపయోగించేవారు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఉన్నారో మీకు తెలియదు. కొత్త అప్ డేట్ తర్వాత, ఆన్‌లైన్ స్టేటస్ తో పాటు లాస్ట్ సీన్ మీరు చూడలేరు. ఈ ఫీచర్‌ అధికారిక లాంచ్ గురించి వాట్సాప్ వెల్లడించలేదు.

Latest Videos

click me!