శామ్‌సంగ్ కి పోటీగా షియోమి ఎం‌ఐ కొత్త స్మార్ట్‌ఫోన్‌.. 8జి‌బి ర్యామ్ తో లేటెస్ట్ ఫీచర్లు ఇవే..

First Published | Jun 22, 2021, 5:53 PM IST

షియోమి ఇండియా కొత్త స్మార్ట్‌ఫోన్ ఎం‌ఐ 11 లైట్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఎం‌ఐ 11 లైట్‌తో పాటు కంపెనీ ఒక కొత్త స్మార్ట్‌వాచ్ ఎం‌ఐ వాచ్ రివాల్వ్ యాక్టివ్‌ను కూడా భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎం‌ఐ 11 లైట్ 6.8 ఎంఎం సన్నగా 157 గ్రాముల బరువు ఉంటుంది. ఇండియాకంటే ముందు ఎం‌ఐ 11 లైట్‌ని ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. 
 

ఎం‌ఐ 11 లైట్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో 10-బిట్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఎం‌ఐ 11 లైట్‌లో స్నాప్‌డ్రాగన్ 732జి ప్రాసెసర్ అందించారు. దీనిని ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించనున్నారు. వైర్ అండ్ వైర్‌లెస్ మోడ్‌తో పనిచేసే ఫోన్‌తో హై రిజల్యూషన్ ఆడియోకు సపోర్ట్ ఉంది. షియోమికి చెందిన ఎం‌ఐ 11 లైట్ స్మార్ట్‌ఫోన్ ఇటీవల విడుదల చేసిన శామ్‌సంగ్ గెలాక్సీ ఎం32కి పోటీగా తీసుకొచ్చారు. షియోమి ఈ కొత్త ఫోన్ ధర, ఫీచర్స్ వివరాలు తెలుసుకొండి...
ఎం‌ఐ 11 లైట్ ధర6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ .18,999. 128 జిబి స్టోరేజ్ తో 8జిబి ర్యామ్ ధర రూ .20,999. ఫోన్ ప్రీ-బుకింగులు జూన్ 25న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతాయి. అలాగే ఫస్ట్ సేల్ జూన్ 28న ఫ్లిప్‌కార్ట్, కంపెనీ వెబ్‌సైట్ నుండి ఉంటాయి.

ఎం‌ఐ 11 లైట్ స్పెసిఫికేషన్లు1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.55-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, హెచ్‌డి‌ఆర్ 10 డిస్‌ప్లే సపోర్ట్, ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ 5, స్నాప్‌డ్రాగన్ 732జి ప్రాసెసర్, 8 జీబీ వరకు ర్యామ్ ఆప్షన్, 128 జీబీ స్టోరేజ్ లభిస్తాయి. దీనిని మెమరీ కార్డ్ సహాయంతో మరింత విస్తరించుకోవచ్చు.
ఎం‌ఐ 11 లైట్ కెమెరాఎం‌ఐ 11 లైట్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. దీని ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్ తో ఎపర్చరు f1.79. రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ , మూడవది 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, కెమెరాతో 23 డైరెక్టర్ మోడ్‌లు ఉంటాయి.
ఎం‌ఐ 11 లైట్ బ్యాటరీఎం‌ఐ 11 లైట్ లో 4250 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. మీరు ఫోన్‌తోనే ఛార్జర్‌ను బాక్స్‌లో పొందుతారు. ఫోన్‌లో డ్యూయల్ స్పీకర్లు కూడా ఉన్నాయి. కనెక్టివిటీ కోసం 4జి ఎల్‌టిఇ, వై-ఫై 802.11 ఎసి, ఐఆర్, బ్లూటూత్, జిపిఎస్ ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్ సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపి53 రేటింగ్ కూడా పొందింది.

Latest Videos

click me!