11 ర్యామ్‌తో వివో కొత్త సిరీస్ 5జి స్మార్ట్‌ఫోన్.. లాంచ్ కి ముందే ఫీచర్లు లీక్.. ట్విట్టర్ లో వైరల్..

First Published | Jun 22, 2021, 11:47 AM IST

చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో  ఒక కొత్త 5జి స్మార్ట్‌ఫోన్ ని తీసుకురాబోతుంది. వివో వి21 సిరీస్ కింద వస్తున్న వివో వి21ఇ 5జిని జూన్ 24న ఇండియాలో లాంచ్ చేయనున్నారు, అయితే దీని లాంచ్ ముందే ఫోన్ ధర, కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. 

వివో వి21ఇ 5జి మైక్రోసైట్ కూడా ప్రత్యక్ష ప్రసారం అయ్యింది. దీంతో ఫోన్ సేల్స్ ఫ్లిప్‌కార్ట్ నుండే ఉంటుందని స్పష్టమైంది. లిస్టింగ్ ప్రకారం 8 జీబీ ర్యామ్, 44W ఫాస్ట్ ఛార్జింగ్ తో ఈ ఫోన్ లాంచ్ కానుంది. వివో వి21ఇ 5జి లాంచ్ జూన్ 24న సాయంత్రం 5 గంటలకు చేయనున్నారు.
లాంచ్ ముందే లీక్ అయిన నివేదిక ప్రకారం వివో వి21ఇ 5జి ధర రూ .24,990గా ఉండనుంది. ఈ ధర వద్ద 128జీబీ స్టోరేజ్‌తో కూడిన 8 జీబీ ర్యామ్‌ వేరియంట్ లభిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వివో వి21 5జిని భారతదేశంలో రూ .29,990 ధరకు విడుదల చేశారు.

వివో వి21ఇ 5జి స్పెసిఫికేషన్లులిస్టింగ్ ప్రకారం వివో వి21ఇకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. అంతేకాకుండా 8 జీబీ ర్యామ్‌తో 3 జీబీ వర్చువల్ ర్యామ్ లభిస్తుంది, కాబట్టి ఈ ఫోన్‌లో మొత్తం 11 జీబీ ర్యామ్ ఉంటుంది. 44W ఫ్లాష్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్‌తో వస్తుంది అలాగే 5జి సపోర్ట్ కూడా ఇచ్చారు. దీని ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంటుంది.
ఇప్పటివరకు లీక్ అయిన నివేదిక ప్రకారం వివో వి21ఇ 5జికి మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ లభిస్తుంది. వివో వి21ఇలో స్నాప్‌డ్రాగన్ 720 జి ప్రాసెసర్ అందించనున్నారు. ఈ కొత్త ఫోన్‌ 4000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

Latest Videos

click me!