కేవలం 3 రోజుల్లో 5 మిలియన్ల మంది గేమ్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. గోప్యత, భద్రతా కారణాల వల్ల భారతదేశంలో పబ్-జిని గత ఏడాది నిషేధించారు. ఆ తరువాత గేమ్ అభివృద్ధి చేసిన క్రాఫ్టన్ సంస్థ చైనాతో సంబంధాలను తెంచుకుని భారతదేశంలో మళ్ళీ గేమ్ ప్రారంభించింది, కానీ ఇప్పుడు బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాతో చైనాకి కనెక్షన్ ఉన్నట్లు తెలుస్తుంది. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా డేటాను చైనాలోని సర్వర్‌లో కూడా స్టోర్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
undefined
పబ్-జి కొత్త అవతార్‌ను అభివృద్ధి చేసిన క్రాఫ్టన్ సంస్థ భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ గేమ్ నిర్వహించబడుతుందని, గేమర్ల గోప్యత సంస్థ మొదటి ప్రాధాన్యత అని లాంచ్ ముందు తెలిపింది. తాజాగా గేమ్ ఆండ్రాయిడ్ వినియోగదారుల డేటా చైనాలోని సర్వర్‌లకు పంపబడుతోందని ఒక కొత్త నివేదిక పేర్కొంది. ఈ సర్వర్ల జాబితాలో టెన్సెంట్ అనుబంధ సంస్థల పేరు కూడా ఉంది. ఇంతకుముందు టెన్సెంట్ మాత్రమే భారతదేశంలో పబ్-జిని ఆపరేట్ చేసేది.
undefined
ఐజిఎన్ ఇండియా నివేదిక ప్రకారం బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా డేటా చైనీస్ సర్వర్లతో పాటు అనేక ఇతర దేశాలలో ఉన్న సర్వర్లకు వెళుతోంది అని స్నిఫర్ యాప్ నుండి వెల్లడైంది. గేమ్ ఐపి అడ్రస్ చైనా మొబైల్ కమ్యూనికేషన్స్ కార్పొరేషన్ ఆఫ్ చైనాకు చెందినదని ఐజిఎన్ పేర్కొంది. దీనికి సంబంధించి కొన్ని నివేదికతో పాటు స్క్రీన్ షాట్లు కూడా బహిర్గతం అయ్యాయి.
undefined
పబ్-జి మొబైల్ కొత్త అవతార్ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా జూన్ 18న భారతదేశంలో అధికారికంగా ప్రారంభించారు. గత ఏడాది భారతదేశంలో పబ్-జి మొబైల్ నిషేధించిన సంగతి మీకు తెలిసిందే.
undefined
ప్రస్తుతం బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా బీటా వెర్షన్ మాత్రమే విడుదల చేశారు. బీటా వెర్షన్ (ఎర్లీ యాక్సెస్)ను కేవలం మూడు రోజుల్లో 5 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. గేమ్ ని ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుండి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
undefined