Technology : చనిపోయాక ఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎందుకు పనిచేయదు? మరి డేటా ఎలా రికవర్ చేయాలి?

Published : Nov 27, 2026, 12:01 PM IST

Smartphone Fingerprint Sensors : ఒక వ్యక్తి చనిపోయాక వేలిముద్రతో ఫోన్‌ను అన్‌లాక్ చేయలేము. ఇలాంటి సమయాల్లో మొబైల్‌లో ఉన్న డేటాను ఎలా తీసుకోవాలో ఇక్కడ వివరంగా చూద్దాం.

PREV
15
చనిపోయినవారి ఫింగర్ ప్రింట్ తో స్మార్ట్‌ఫోన్ ఓపెన్ చేయలేమా?

ప్రతిరోజూ కోట్లాదిమంది తమ స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి వేలిముద్ర అంటే ఫింగర్ ప్రింట్ (Fingerprint) సదుపాయాన్ని ఉపయోగిస్తారు. ఇలా బ్రతికుండగా ఫోన్ ఓపెన్ చేయడానికి ఉపయోగించిన ఫింగర్ ప్రింట్స్ చనిపోయాక పనిచేయవు… ఫోన్ లోని ఫింగర్ ప్రింట్ సెన్సార్ అతని వేలిముద్రను అంగీకరించదు. ఈ విషయం చాలామందికి తెలియదు.

అయితే మనిషి చనిపోయాక ఫింగర్ ప్రింట్స్ పనిచేయకపోడానికి ప్రధాన కారణం శరీరంలో ప్రవహించే అత్యంత సూక్ష్మమైన విద్యుత్ ఆగిపోవడమే. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రత్యేక డిజైన్, పనిచేసే విధానంకు శరీరంలోని విద్యుత్ కు సంబంధం ఉంది. అందుకే ప్రాణం లేని మృతదేహం వేలిముద్రతో ఫోన్ అన్‌లాక్ చేయడం కుదరదు.

25
ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుంది?

ఫోన్‌లో ఉండే ఫింగర్ ప్రింట్ స్కానర్ కేవలం వేలిముద్ర చిత్రాన్ని మాత్రమే క్యాప్చర్ చేయదు. చర్మంపై ఉండే అత్యంత సూక్ష్మమైన తేమ, ఉష్ణోగ్రత, శరీరంలో ప్రవహించే అత్యంత సూక్ష్మమైన విద్యుత్‌ను కూడా గ్రహిస్తుంది. అందుకే సెన్సార్‌పై మనం వేలు పెట్టగానే అది ప్రాణంతో ఉన్నవారిదో, ప్రాణం లేనివారిదో ఫోన్ ఈజీగా కనుక్కుంటుంది. ఈ సమాచారాన్ని అంతా ప్రాసెస్ చేసిన తర్వాతే ఫింగర్ ప్రింట్ సాయంతో ఫోన్ అన్ లాక్ చేయాలో వద్దో నిర్ణయించబడుతుంది.

35
చనిపోయాక వేలిముద్రను ఫోన్ ఎందుకు అంగీకరించదు?

బతికున్న వ్యక్తి శరీరంలో రక్తం నిరంతరం ప్రవహిస్తుంటుంది. అంతేకాకుండా చర్మంలో కొద్దిగా విద్యుత్, తేమ ఉంటాయి. చనిపోయిన కొద్దిసేపటికే గుండె ఆగిపోయి, వేళ్ల తేమ ఆరిపోయినప్పుడు, చర్మంపై ఉండే సూక్ష్మమైన విద్యుత్ కూడా నిలిచిపోతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ సరిగ్గా పనిచేయడానికి ఈ విద్యుత్ చాలా అవసరం.

ఇక చనిపోయాక చర్మం ముడతలు పడుతుంది కాబట్టి వేలిముద్ర నిర్మాణంలో కూడా కొంచెం మార్పు వస్తుంది. ఇలాంటి స్థితిలో మనిషి బతికి ఉన్నాడా, లేదా అని సెన్సార్ గ్రహించలేదు… అందుకే ఆ వేలిముద్రను చెల్లనిదిగా భావించి ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి నిరాకరిస్తుంది.

45
అనుకోని పరిస్థితుల్లో ఫోన్ డేటాను ఎలా తీసుకోవాలి?

ఏదైనా అనుకోని సంఘటన జరిగితే కుటుంబ సభ్యులు ఫోన్‌ను అన్‌లాక్ చేసి అందులోని ముఖ్యమైన ఫోటోలు, డాక్యుమెంట్లు, ఇతర డేటాను సులభంగా తీసుకోవడానికి టెక్ కంపెనీలు కొన్ని ప్రత్యేక సదుపాయాలను అందించాయి.

లెగసీ కాంటాక్ట్ : ఐఫోన్ వాడేవారు తమ యాపిల్ ID లో 'Legacy Contact' సదుపాయాన్ని జోడించవచ్చు. ఇందులో కుటుంబ సభ్యుడు లేదా బాగా తెలిసిన నమ్మకమైన వ్యక్తి పేరును నమోదు చేసి పెట్టుకోవచ్చు. అవసరమైనప్పుడు ఆ వ్యక్తి డెత్ సర్టిఫికెట్, స్పెషల్ కోడ్ ఉపయోగించి మీ ఐక్లౌడ్ డేటాను పొందవచ్చు.

55
ఆండ్రాయిడ్ యూజర్లు ఏం చేయొచ్చు?

యాపిల్ లెగసీ కాంటాక్ట్ సదుపాయం లాగే గూగుల్ కూడా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒక ప్రత్యేక సదుపాయాన్ని ఇస్తుంది.

ఇన్-యాక్టివ్ అకౌంట్ మేనేజర్ : గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్లకు 'Inactive Account Manager' అనే ఫీచర్‌ను అందిస్తుంది. దీని సెట్టింగ్స్‌లో మీ అకౌంట్ నిర్దిష్ట కాలం పాటు ఉపయోగించబడకపోతే, మీరు ఎంచుకున్న వ్యక్తికి ఈ-మెయిల్ పంపడానికి, మీ ఫోటోలు, ఈ-మెయిల్ లేదా గూగుల్ డ్రైవ్ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వడానికి ముందే సెట్ చేసి పెట్టుకోవచ్చు.

భద్రతా నియమాలు, జాగ్రత్తలు : భద్రతా కారణాల దృష్ట్యా, కంపెనీలు నేరుగా ఫోన్ లాక్ లేదా పాస్‌వర్డ్‌ను బ్రేక్ చేయడానికి అనుమతించవు. కాబట్టి ముందే నమ్మకమైన వ్యక్తిని తమ డిజిటల్ నామినీగా నియమించి పెట్టుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories