మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను ఎవరు చూస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా .. ఇలా చేయండి ?

First Published | Oct 11, 2021, 8:18 PM IST

 దాదాపు 15 సంవత్సరాల క్రితం ఫేస్‌బుక్ గురించి ఎవరికీ తెలియదు, కానీ నేడు ఫేస్‌బుక్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియాగా మారింది. ఫేస్‌బుక్ ప్రజలు వారి ఫోటోస్, వీడియోస్, లైవ్ స్ట్రిమ్ ఇంకా ఎన్నో ఇతరులతో   షేర్ చేసుకోవచ్చు. 

ఫేస్‌బుక్ ద్వారా కూడా చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు. అంటే మీ ఆర్ధిక  అవసరాలను దాదాపుగా తీర్చే వేదికగా మారింది. ఇక్కడ ఫ్రెండ్షిప్ చేయడం చాలా సులభం. ఇందుకు మీరు ఫ్రెండ్షిప్ చేయాలనుకునే వారికి జస్ట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే చాలు. వారు మీ ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను అంగీకరిస్తే ఫ్రెండ్షిప్ చేయవచ్చు. ఒకవేళ ఫేస్‌బుక్‌లో అపరిచుతులతో ఫ్రెండ్షిప్ నచ్చకపోతే వారిని బ్లాక్ చేయవచ్చు, కానీ వారు మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లను రహస్యంగా చెక్ చేస్తూనే ఉంటారు. మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ని ఎవరు చెక్ చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు చాలా సులభం. అదెలా అంటే ?
 

ముందుగా మీ స్మార్ట్ ఫోన్లో  ఫేస్‌బుక్ యాప్ ప్రైవసీ సెట్టింగ్‌లకు వెళ్ళి మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ని ఎవరు ట్రాక్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర మొబైల్ లేకపోతే మీరు డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
 

Latest Videos


మీరు మీ డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో ఫేస్‌బుక్ కి లాగిన్ అవ్వాలి. 
ఇప్పుడు మీరు మీ టైమ్‌లైన్‌లో ఎక్కడైనా కంప్యూటర్ మౌజ్ రైట్ క్లిక్ చేసి తరువాత వ్యూ పేజ్ సోర్స్ పై  క్లిక్ చేయండి లేదా CTRL + Uని కూడా నొక్కవచ్చు. 
దీని తర్వాత మీరు ctrl+f నొక్కడం ద్వారా సెర్చ్ బార్‌లో BUDDY_IDని వెతకాలి. 
BUDDY_ID తో మీకు 15 అంకెల కోడ్ వస్తుంది.
ఆ కోడ్‌ని కాపీ చేసి బ్రౌజర్‌లో facebook.com/profile ID (15 అంకెల కోడ్) అని టైప్ చేయడం ద్వారా సెర్చ్  చేయండి.
ఇప్పుడు మీ ప్రొఫైల్‌ను చూసిన  వారి  ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను చూపిస్తుంది.

మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ని ఎవరు చెక్ చేస్తున్నారో తెలుసుకోవడానికి మరో మార్గం కూడా ఉంది. దీని కోసం మీరు గూగుల్ క్రోమ్ (Chrome) ఎక్స్టెంషన్ సహాయం తీసుకోవచ్చు.  గూగుల్ క్రోమ్ కు వెళ్లడం ద్వారా మీరు ఫేస్‌బుక్  సూపర్ వ్యూయర్ వంటి ఎక్స్టెంషన్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీని సహాయంతో మీ ప్రొఫైల్‌ను ఎవరు చూస్తున్నారో తెలుసుకోవచ్చు. అయితే ఈ రెండు విధాలుగా ఎవరు ఏ తేదీన, ఏ సమయంలో మీ ప్రొఫైల్‌ని చూశారో తెలుసుకోవచ్చు.

click me!