ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సర్వీసులకు మళ్ళీ బ్రేక్.. ఒక్క వారంలోనే రెండుసార్లు.. కారణం ఏంటంటే ?

First Published | Oct 9, 2021, 1:01 PM IST

సోమవారం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో సహా ఇతర సోషల్ మీడియా యాప్‌లు డౌన్ అయిన వారం రోజుల వ్యవధిలోనే ఇన్‌స్టాగ్రామ్ మళ్లీ నిలిచిపోయింది. ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది వినియోగదారులు ఫోటోలను షేర్ చేయడంలో సమస్యలను ఎదురుకొన్నారు.

ఈ రెండు యాప్‌లు రాత్రి 12 గంటల తర్వాత ఒక గంట పాటు ప్రభావితమయ్యాయి. సర్వర్ డౌన్ కారణంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కొంతకాలం నిలిచిపోయింది. దీంతో  చాలా మంది వినియోగదారులు సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే ఇప్పుడు సర్వీస్ పునరుద్ధరించినట్లు   వినియోగదారులకి కలిగిన ఈ అసౌకర్యానికి కంపెనీ క్షమాపణలు కూడా చెప్పింది. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ రిఫ్రెష్‌ కాకపోవడం, ఫీడ్స్‌ ఆగిపోవడం, ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ పని చేయకపోవడంతో పాటు ఫేస్‌బుక్‌ కార్యాలయంలోనూ పలు సేవలు ఆగిపోయినట్లు సమాచారం. 

కొంతమంది వినియోగదారులు మా యాప్‌లు, వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేయడంలో ఇబ్బంది ఎదురుకొంటున్నారని ఫేస్‌బుక్ ట్వీట్ చేసింది. మీరు మా సేవలను ఉపయోగించలేకపోతున్నందుకు మమ్మల్ని క్షమించండి. ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి మీరు మా యాప్స్ పై ఎంత ఆధారపడి ఉన్నారో మాకు తెలుసు. ఇప్పుడు మేము ఈ సమస్యను పరిష్కరించాము. ఈసారి కూడా మీ సహనానికి మరోసారి ధన్యవాదాలు అంటూ ట్వీట్ లో వెల్లడించింది. 

Latest Videos


ఇన్‌స్టాగ్రామ్ కూడా మమ్మల్ని క్షమించండి ఈ సమస్యను పరిష్కరించడానికి వీలైనంత త్వరగా కృషి చేస్తున్నామని ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే, మీలో కొంతమందికి ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌ని ఉపయోగించడంలో కొంత సమస్య ఉండవచ్చని తెలిపింది. ఇంకోవైపు #Instagram Down, #Instadown హ్యాష్‌ట్యాగులు విపరీతంగా షేర్‌ కావడంతో ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారాయి.

ఒక వారంలో రెండుసర్లు'
గత వారం ఆదివారం అర్థరాత్రి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ సర్వర్లు దాదాపు ఆరు గంటలపాటు పని చేయలేదు. ఈ కారణంగా ఎంతో మంది వినియోగదారులు సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే ఈ రోజు ఉదయం కంపెనీ దినికి క్షమాపణలు చెప్పింది. ఫేస్‌బుక్ డేటా సెంటర్‌ల మధ్య నెట్‌వర్క్ కమ్యూనికేషన్‌ను సమన్వయం చేసే రౌటర్ కాన్ఫిగరేషన్‌లలో మార్పులకు ఈ అంతరాయం కారణమని పేర్కొంది.

ఫేస్‌బుక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ జనార్దన్ ఒక  పోస్ట్‌లో నెట్‌వర్క్ ట్రాఫిక్‌లో ఈ అంతరాయం మా డేటా సెంటర్లు కమ్యూనికేట్ చేసే విధానంపై భారీ ప్రభావాన్ని చూపుతుందని సేవలను నిలిపివేసింది. చాలా మంది సాంకేతిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫేస్‌బుక్ పడిపోవడం టెక్నికల్ లోపం అని సూచించారు.

ఒకేవారంలో రెండుసార్లు  ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ షట్‌డౌన్‌ కావడంపై యూజర్లు అసహనంతో పాటు సెటైర్లు చేశారు . శుక్రవారం రాత్రి  ట్విటర్‌లో ఫేస్‌బుక్‌ మీద  మీమ్స్‌తో  ట్రోల్ల్స్ చేశారు. 

click me!