వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్: ప్రపంచమంతా ఎదురుచూస్తున్న ఆ ఫీచర్ వస్తోంది..

First Published | Sep 8, 2021, 1:35 PM IST

వాట్సాప్ నేడు ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్. వాట్సాప్‌లో ఇప్పటికే చాలా అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి, అయితే వాట్సాప్ యూజర్ల కొత్త ఫీచర్‌ల డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. వాట్సాప్  వినియోగదారుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది. 

ఇప్పుడు మీరు మాత్రమే కాకుండా ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రైవసీ సెట్టింగ్‌కి సంబంధించి అలాంటి ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోందని సమాచారం. ఈ రాబోయే ఫీచర్ గురించి తెలుసుకుందాం ...

వాట్సాప్ లాస్ట్ సీన్, ప్రొఫైల్ ఫోటో, అబౌట్ గురించి కొత్త అప్‌డేట్‌ను విడుదల చేయబోతోంది. బీటా వెర్షన్‌లో ఈ కొత్త ఫీచర్ ని టెస్టింగ్ చేస్తున్నారు. కొత్త అప్‌డేట్ తరువాత మీరు మీ లాస్ట్ సీన్, ప్రొఫైల్ ఫోటో, ఆబౌట్  ఎవరు చూడవచ్చో ఎవరు చూడకూడదో స్వయంగా నిర్ణయించుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే మీరు ప్రస్తుతం మీ స్టేటస్ సెట్టింగ్ చేసుకున్నట్లే  ఇప్పుడు లాస్ట్ సీన్, ప్రొఫైల్ ఫోటో, ఆబౌట్ సెట్టింగ్‌లను కూడా సెట్ చేయవచ్చు.

మీ లాస్ట్ సీన్, ప్రొఫైల్ ఫోటో, అబౌట్ మీరు చూడాలనుకున్న వారు మాత్రమే చూడాలనుకుంటే ఈ వార్త మీ కోసమే. వాట్సాప్ బీటా ట్రాకర్ WABetaInfo ఈ కొత్త ఫీచర్ గురించి సమాచారాన్ని ఇచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లలో కొత్త ఫీచర్ టెస్ట్ చేస్తున్నట్లు ఒక నివేదిక పేర్కొంది.  ఇంతకు ముందు ప్రొఫైల్ ఫోటో, లాస్ట్ సీన్ కి ఎవ్రి వన్, మై కాంటాక్ట్స్, నో వన్ అనే మూడు ఆప్షన్స్ మాత్రమే ఉండేవి.

Latest Videos


కొత్త అప్‌డేట్ తర్వాత, లాస్ట్ సీన్‌ను డిసేబుల్ చేసే సదుపాయం కూడా ఉంటుందని నివేదికలో తెలిపింది. 2017 సంవత్సరంలో వాట్సాప్ ప్రైవసి దృష్టిలో ఉంచుకుని మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ ఫీచర్‌ని ప్రవేశపెట్టింది ఇప్పుడు కంపెనీ ఈ ఫీచర్‌ను ఒక అడుగు ముందుకు తీసుకేళ్తుంది. కొత్త ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ మోడ్‌లో ఉంది అయితే అందరికీ అందుబాటులోకి అప్పుడు వస్తుందని దానిపై ఖచ్చితమైన తేదీ వెల్లడించలేదు.

ఈ నెల జూన్-జూలై మధ్య మూడు మిలియన్లకు పైగా వాట్సాప్ ఖాతాలను నిషేధించినట్లు తాజాగా మంత్లి యూజర్ సేఫ్టీ రిపోర్ట్ విడుదల చేసిన సంగతి మీకు తెలిసిందే. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను సురక్షితంగా, స్పామ్‌గా ఉంచడానికి ఆన్‌లైన్ స్పామ్ ఇంకా ఆన్ లైన్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఈ చర్య తీసుకున్నట్లు వాట్సాప్ తెలిపింది. 

జూన్ నుండి జూలై 2021 మధ్య సుమారు 30 లక్షల 27 వేల వాట్సాప్ ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. గ్రీవెన్స్ ఆఫీసర్‌కు వచ్చిన ఫిర్యాదుల ద్వారా ఈ వాట్సాప్ ఖాతాలు ఆటోమేటిక్ టూల్ ద్వారా ప్రాసెస్ చేసారు.

click me!