సివిల్ కోర్ట్ జడ్జి కె.ఎమ్ జైస్వాల్ గేమ్ రూపొందించిన కంపెనీ పేరడీ స్టూడియోస్‌ని గేమ్ ప్రారంభించడం ఇంకా పున:ప్రారంభించడం అలాగే సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన ఏదైనా కంటెంట్‌ను ఉత్పత్తి చేయకుండా నిరోధించారు. సల్మాన్ గురించి ఎలాంటి ప్రకటన చేయవద్దని, ప్లే-స్టోర్ లేదా మరే ఇతర యాప్ స్టోర్‌లో గేమర్లకు గేమ్ ని అందుబాటులో ఉంచవద్దని న్యాయమూర్తి బలమైన పదాలతో కంపెనీని కోరారు. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 20న జరగనుంది.