ఈ ప్లాన్‌లతో కనెక్షన్ తీసుకున్నందుకు ఇన్‌స్టాలేషన్ ఛార్జీ ఫ్రీ అని కంపెనీ తెలిపింది. 1 జిబిపిఎస్ వరకు స్పీడ్ ఈ ప్లాన్‌లతో అందుబాటులో ఉంటుంది, అయితే జియో ఈ ప్లాన్‌ల గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కొత్త ప్లాన్ వివరాలను జియో వెబ్‌సైట్, మైజియో యాప్‌లో చూడవచ్చు. ఈ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం ...
జియో ఫైబర్ కొత్త ప్లాన్‌లు
కొత్త ప్లాన్ల లిస్ట్ లో చౌకైన ప్లాన్ ధర రూ. 2,097. మూడు నెలల పాటు ఆన్ లిమిటెడ్ డేటాతో 100Mbps స్పీడ్, ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. ఈ ప్లాన్‌లో వాల్యు యడెడ్ సర్వీస్ లేదా ఓటిటి యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉండదు. ఇన్‌స్టాలేషన్ కోసం ఎటువంటి ఛార్జీ ఉండవు.
రెండవ ప్లాన్ ధర రూ .2,997. జియో ఫైబర్ ఈ ప్లాన్‌తో 14 ఓటిటి యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది, ఇందులో ఆల్ట్ బాలాజి, అమెజాన్ ప్రైమ్ వీడియొ, డిస్కవరి ప్లస్, డిస్ని ప్లస్ హాట్ స్టార్, ఏరోస్ నవ్, జి5 ఉన్నాయి. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా మూడు నెలలు. 150Mbps డౌన్‌లోడ్ అండ్ అప్‌లోడ్ స్పీడ్ పొందుతారు. ఇందులో ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంది.
మూడవ ప్లాన్ ధర రూ .4,497, దీనిలో ఓటిటి యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా, ప్రత్యేకంగా నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో 300Mbps డౌన్‌లోడ్ అండ్ అప్‌లోడ్ స్పీడ్, అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు.
జియో ఫైబర్ నాల్గవ ప్లాన్ ధర రూ .7,497, దీనిలో 500Mbps స్పీడ్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా మూడు నెలలు ఇంకా 15 ఓటిటి యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. ఈ ప్లాన్‌లో కూడా, అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది.
మీకు ఇంకా ఎక్కువ స్ప్పిడ్ కావాలంటే జియో 11,997 ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్‌తో 1Gbps స్పీడ్ అందుబాటులో ఉంటుంది ఇంకా ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంది. ఈ ప్లాన్‌తో కూడా మీరు ఆల్ట్‌బాలాజీ, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్కవరీ ప్లస్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నుండి ఇరోస్ నౌ, జీ5 ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. అదనంగా రూ.25,497 ప్లాన్ కూడా ప్రారంభించింది, దీనిలో 6,600GB డేటా 1Gbps స్పీడ్ తో అందుబాటులో ఉంటుంది. 15 ఓటిటి యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్‌లో ఉచితంగా పొందుతారు.