వాట్సాప్ త్వరలో ఈ కొత్త ఫీచర్‌ని తీసుకోస్తోంది.. ఇప్పుడు మీ మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా..

First Published | Aug 20, 2021, 6:55 PM IST

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ యజమాన్యంలోని వాట్సాప్ కొన్ని నెలల క్రితం డిసపియర్ మెసేజ్  ఫీచర్‌ని ప్రవేశపెట్టిన సంగతి మీకు తెల్సిందే. ఈ ఫీచర్ ద్వారా  వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌లు 7 రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి, కానీ ఇప్పుడు కంపెనీ ఈ ఫీచర్ కోసం ఒక అప్ డేట్ తో సిద్ధమవుతోంది. 

వాట్సాప్‌ చాట్ మెసేజులు ఇప్పుడు 90 రోజులు అంటే మీరు పంపిన మెసేజులు 3 నెలల తర్వాత ఆటోమేటిక్ గా తొలగిపోతాయి. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ లో ఉంది. WaBetaInfo నివేదిక ప్రకారం ఈ  కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్  యూజర్ల కోసం  టెస్టింగ్ చేస్తున్నారు. WaBetaInfo ఈ ఫీచర్ అప్‌డేట్‌కి సంబంధించి స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేసింది. ఆండ్రాయిడ్  బీటా వెర్షన్ 2.21.17.16 లో ఈ కొత్త అప్‌డేట్ చూడవచ్చు.
 

గత కొన్ని నెలలుగా వాట్సాప్ కొత్త ఫీచర్లపై పనిచేస్తోంది. కొంతకాలం క్రితం వాట్సాప్  వ్యూ వన్స్ అనే ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది, అంటే మీరు పంపిన మెసేజ్ చూసిన తర్వాత  అదృశ్యమవుతాయి. అంతేకాకుండా వాట్సాప్ స్మార్ట్ స్విచ్ అనే మరో కొత్త ఫీచర్‌పై కూడా పనిచేస్తోంది. ఈ ఫీచర్ ప్రవేశపెట్టిన తర్వాత యూజర్లు వారి వాట్సాప్ ఖాతాలను అండ్రాయిడ్ ఇంకా ఐ‌ఓ‌ఎస్ లలో మార్చుకోగలుగుతారు. దీని ద్వారా చాట్‌లను కూడా బ్యాకప్ చేయవచ్చు.

Latest Videos


వాట్సాప్  వెబ్ వెర్షన్ కోసం మల్టీ డివైజెస్ సపోర్ట్ విడుదల చేసింది, అంటే మీరు మీ వాట్సాప్ ఖాతాను  వేర్వేరు ల్యాప్‌టాప్‌లు లేదా డెస్క్‌టాప్‌లలో ఉపయోగించవచ్చు. అంతేకాకుండా వాట్సాప్ వెబ్‌లో త్వరలో ఒక కొత్త అప్‌డేట్ అందుబాటులోకి రాబోతోంది, దీని ద్వారా  వెబ్‌ వెర్షన్‌లో వాట్సాప్‌ను ఉపయోగించడానికి ఫోన్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు.

click me!