మాన్స్టర్ బ్యాటరీతో శామ్‌సంగ్ గెలాక్సీ లేటెస్ట్ 5జి స్మార్ట్‌ఫోన్‌.. ఇప్పుడు 20 వేల కన్నా తక్కువ ధరకే..

First Published | Aug 20, 2021, 3:51 PM IST

ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్ రూ .20 వేల పరిధిలో 5జి స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టేందుకు  సన్నద్ధమైంది. శామ్‌సంగ్  గెలాక్సీ ఎం32 5జి వెర్షన్ అంటే శామ్‌సంగ్ గెలాక్సీ ఎం32 5జిని ఆగస్టు 25న భారతదేశంలో విడుదల చేయనుంది.

4జి సపోర్ట్‌తో కూడిన శామ్‌సంగ్ గెలాక్సీ ఎం32 ఈ ఏడాది జూన్‌లో విడుదలైంది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎం32 5జికి 5000mAh బ్యాటరీ అందించారు, అంటే 4జి వెర్షన్‌ కంటే పెద్ద బ్యాటరీ. ఇంకా ఈ కొత్త ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్, నాచ్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ ఎం42 5జిని పరిచయం చేస్తూ  5జి పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎం32 5జి  ప్రాడక్ట్ పేజీ కూడా అమెజాన్ లో ప్రత్యక్షమైంది. ఈ ఫోన్‌ను రెండు కలర్స్ ఆప్షన్స్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్ ద్వారా విక్రయించనున్నారు. అలాగే రిటైల్ స్టోర్‌ల నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎం32 5జి స్పెసిఫికేషన్లు

6.5-అంగుళాల హెచ్‌డి ప్లస్  ఇన్ఫినిటీ వి డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్షన్ 720 ప్రాసెసర్, నాలుగు బ్యాక్ కెమెరాలు  ఉంటాయి. వీటిలో ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్స్,  రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్, మూడో లెన్స్ 5 మెగాపిక్సెల్స్, నాల్గవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ ఇచ్చారు. సెల్ఫీ కోసం 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.

Latest Videos


 గెలాక్సీ ఎం32 5జి  డిజైన్ గతంలో లాంచ్ చేసిన గెలాక్సీ ఏ32 లాగానే ఉంటుంది. ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. శామ్‌సంగ్ నాక్స్ సెక్యూరిటీ స్మార్ట్‌ఫోన్‌తో ఇన్‌బిల్ట్ చేశారు. రాబోయే రెండు సంవత్సరాలకు ఓ‌ఎస్ అప్‌డేట్‌లు ఉంటాయి. ఇంకా 15W ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్‌కి సపోర్ట్ చేస్తుంది.

Samsung Galaxy M32 5G will get a 6.5-inch HD + Infinity V display. Apart from this, MediaTek Dimension 720 processor will be available in it. Four rear cameras will be available in the phone, out of which the primary lens will be 48 megapixels.

click me!