వావ్.. పింక్ కలర్ లో వాట్సాప్ కొత్త అప్ డేట్.. క్లిక్ చేశారో అంతే ?

First Published | Apr 19, 2021, 4:53 PM IST

ఈ రోజుల్లో ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ వాడని వారు చాలా తక్కువ. కొంతకాలం క్రితం వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీ కారణంగా  వాట్సాప్‌ డౌన్ లోడ్లు భారీగా పడిపోయాయి అంతేకాదు చాలా మంది సిగ్నల్ తో పాటు ఇతర సోషల్ మీడియా యాప్స్ కి మరాల్సి వచ్చింది.

తాజాగా ఇప్పుడు ఒక మెసేజ్ వాట్సాప్‌ లో చాలా వైరల్ అవుతోంది. అదేంటంటే వాట్సాప్ పింక్. వాట్సాప్ లో విరల్ అవుతున్న ఈ మెసేజ్ లోని లింక్‌ పై క్లిక్ చేస్తే మీ వాట్సాప్ కలర్ థీమ్‌ ఆకుపచ్చ నుండి పింక్‌గా మారుస్తుందని, అలాగే మరిన్ని కొత్త ఫీచర్స్ లభిస్తాయని పేర్కొంది.
undefined
మరొక విషయం ఏంటంటే వాట్సాప్ పింక్ పూర్తిగా అఫిషియల్ అని ఈ అప్ డేట్ ని వాట్సాప్ స్వయంగా విడుదల చేసిందని కూడా ఈ మెసేజ్ లో ఉంది. కాబట్టి ఈ మెసేజ్ లో నిజం ఎంతో తెలుసుకుందాం..?
undefined

Latest Videos


వాట్సాప్ పింక్ గురించి సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ఒక ట్వీట్ ద్వారా ప్రజలను హెచ్చరించారు. అలాంటి మెసేజ్ తో కనిపించే లింక్స్ పై క్లిక్ చేయవద్దని తెలిపారు. సైబర్ స్కామ్ అనేది చాలా పాత పద్ధతి అయినప్పటికి దీని ద్వారా డేటాను హ్యాక్ చేయవచ్చు అలాగే హ్యాకర్లు మీ ఫోన్‌కి అక్సెస్ పొందుతారు. ఇంకా మీ ఫోన్‌లోని మొత్తం డేటాను కూడా యాక్సెస్ చేయవచ్చు.
undefined
ఈ లింక్‌ల ద్వారా హ్యాకర్లు మీ ఫోన్‌లో ఒక ఏ‌పి‌కే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. తరువాత మీ వ్యక్తిగత సమాచారం లేదా పాస్‌వర్డ్‌ను గూగుల్ ఫారమ్‌లో ఎంటర్ చేయమని అడుగుతుంది. ఫోన్‌లో ఏ‌పి‌కే ఫైల్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత హ్యాకర్లు మీ ఫోన్‌లోకి సులభంగా ప్రవేశించి బ్యాకింగ్ నుండి మీ మొత్తం వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేస్తారు.
undefined
పింక్ వాట్సాప్ అనేది కొన్ని నెలల క్రితం వైరల్ అయిన వాట్సాప్ గోల్డ్ లాంటిదే. ఇలాంటి యాప్స్, లింక్స్ ఇంకా మెసేజెస్ పూర్తిగా నకిలీవి. వాటి ద్వారా మీ ఫోన్‌లో మాల్వేర్ యాప్స్ మొదలైన వాటిని ఇన్‌స్టాల్ చేసే ప్రయత్నం చేస్తారు. మీరు అలాంటి మెసేజెస్ పొందితే వెంటనే దాన్ని డిలెట్ చేయండి.
undefined
undefined
click me!