ఈ ఫోన్ ని ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా విక్రయించనున్నారు. దీనికి సంబంధించి అమెజాన్ శామ్సంగ్ గెలాక్సీ ఎం42 5జి ఫోన్ డిజైన్ ఫోటోలను కూడా వెల్లడించింది. దీనికి వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ ప్లే, నాలుగు బ్యాక్ కెమెరాలు ఉంటాయి.
శామ్సంగ్ గెలాక్సీ ఎం42 5జి స్మార్ట్ ఫోన్ ని అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో జాబితా చేశారు. అంతేకాకుండా శామ్సంగ్ మైక్రో సైట్ కూడా ప్రత్యక్ష ప్రసారం అయ్యింది. అమెజాన్ ప్రకారం శామ్‌సంగ్ గెలాక్సీ ఎం42 5జికి స్నాప్‌డ్రాగన్ 750జి ప్రాసెసర్ లభిస్తుంది. అలాగే సామ్‌సంగ్ సెక్యూరిటీ, శామ్‌సంగ్ పే కూడా ఇందులో చూడవచ్చు. ఇంకా ఈ ఫోన్‌లో ఎన్‌ఎఫ్‌సి కూడా సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎం42 5జి ధర రూ.20వేల నుంచి రూ.25 వేల మధ్య ఉంటుందని గతంలో లీకైన నివేదికలు పేర్కొన్నాయి. అమెజాన్ కాకుండా శామ్సంగ్ ఆన్‌లైన్ స్టోర్, రిటైల్ స్టోర్ నుండి కూడా ఈ ఫోన్ ని విక్రయించనున్నారు.
లీకైన నివేదికల ప్రకారం ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11, 6 జీబీ ఇంకా 8 జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్‌తో ఫోన్ లాంచ్ కానుంది. అలాగే 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ లభిస్తుంది. దీనిలో భారీ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని చూడవచ్చు.