వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రానున్న ఈ సరికొత్త ఫీచర్ల గురించి తెలుసా ?

First Published | Jul 12, 2021, 1:49 PM IST

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ యజమాన్యంలోని ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్  ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తుంటుంది. అయితే గత  కొంతకాలంగా భారత్‌లో  వాట్సాప్  ప్రైవసీ పాలసీ వివాదం కొనసాగుతుంది. తాజాగా ఆండ్రాయిండ్ అండ్ ఐఫోన్ యూజర్లకు కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు తీసుకొచ్చేందుకు వాట్సాప్ కంపెనీ సిద్ధమైంది.
 

వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం యాప్ నోటిఫికేషన్లపై కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్ బ్యానర్‌, ఫొటోలు, వీడియోలు, జీఫీ స్టిక్కర్లలో మరింత సమాచారం అందించే దిశగా వాట్సాప్ అడుగులు వేస్తోంది. యాప్ నోటిఫికేషన్‌ను వాట్సాప్ యూజర్లు పెద్దదిగా చేసుకుని ఛాట్ ప్రివ్యూ కూడా చెక్ చేసుకునే సదుపాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తోంది. నోటిఫికేషన్‌లో నేరుగా స్క్రోల్ చేసి పాత మెస్సేజ్‌లు సైతం చూసేలా మార్పులు చేస్తుంది.
undefined
వాట్సాప్ తీసుకొస్తున్న ఫీచర్లలో వ్యూ వన్స్ ఫీచర్ ఒకటి. సాధారణంగా మనం ఎవరికైనా మెస్సేజ్, ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్ మెస్సేజ్, జీఫీ ఇమేజ్ పంపితే అవతలి వ్యక్తులు వాటిని ఓపెన్ చేసి ఎన్నిసార్లయినా చెక్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ వ్యూ వన్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక మీరు పంపించే మెస్సేజ్, వీడియోలు, పొటోలు ఏదైనా ఒక వ్యక్తి ఒకసారి చూపి చాట్ నుంచి బయటకు వస్తే చాలు ఆ మెసేజ్ అదృశ్యం అవుతుంది. అయితే మెస్సేజ్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి టెక్ట్స్, ఫొటో, జీఫీ మెస్సెజ్‌లను స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం కల్పించింది.
undefined

Latest Videos


వాట్సాప్ సంస్థ తీసుకురాబోతున్న మరో సరికొత్త ఫీచర్ వాయివ్ వేవ్‌ఫామ్స్. వాయిస్ మెస్సేజ్‌లు వింటున్న సమయంలో వాయివ్ అనేది వేవ్‌ఫామ్ రూపంలో కనిపిస్తుంది. వాట్సాప్ బీటా ప్రకారం ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు సిద్దంగా ఉంది. ఐఓఎస్ యూజర్లకు ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకూ వాయిస్ మెస్సేజ్ వింటుంటే బార్ ముందుకు వెళ్తుంది. కానీ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక వెవ్స్ రూపంలో మెస్సేజ్ డిస్‌ప్లే అవుతుంది.
undefined
undefined
click me!