గేమ్ ఛాలెంజస్ పూర్తి చేయడానికి ట్రైనర్ సహాయం కూడా తీసుకోవచ్చు. గేమ్ డెవలప్‌మెంట్ కంపెనీ నియాంటిక్ ఈ ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నది. దీని కోసం గేమ్ డెవలపర్లు గూగుల్ ప్లేతో కూడా భాగస్వామ్యం చేసుకున్నారు. దీని ద్వారా భారతీయ గేమర్లు కొన్ని ఫన్ ఆఫర్లను పొందవచ్చు.
undefined
ఈ రియాలిటీ గేమ్ పోకీమాన్ గోని 6 జూలై 2016న లాంచ్ చేశారు. అయితే జూలై 6న ప్రారంభమైన ఈ గేమ్ ఈవెంట్ జూలై 15 వరకు ఉంటుంది, తరువాత పోకీమాన్ గో ఫెస్ట్ 17 నుండి 18 వరకు జరుగుతుంది. టిక్కెట్లు కొనుగోలు చేసే గేమర్లు ఇతర టీంలతో పర్ట్నర్ అవ్వోచు. హవర్ ఛాలెంజ్ పూర్తి చేయడానికి భారత గేమర్లు గ్లోబల్ టీమ్‌తో కూడా పార్ట్నర్షిప్ చేసుకోవచ్చు.
undefined
ఈ ఫెస్ట్ సందర్భంగా గేమర్లకు 24 చాలెంజెస్ ఉంటాయి. ఈ ఫెస్ట్‌లో పాల్గొనే గేమర్లకు మూడు నెలల పాటు యూట్యూబ్ ప్రీమియంకు ఫ్రీ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. ఫెస్ట్ సమయంలో గేమర్లకు ఫ్లయింగ్ పికాచు, దారుమక, షైనీ దారుమకలను గెల్చుకునే అవకాశం లభిస్తుంది. పికాచుతో పాటు ఈ 5 సంవత్సరాల వార్షికోత్సవానికి చిహ్నంగా 5 ఆకారపు బెలూన్ కూడా ఉంటుంది.
undefined
దీనిపై నియాంటిక్ ఇంక్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ టెల్లెజ్ మాట్లాడుతూ, "నియాంటిక్ కి భారతదేశం అత్యంత నమ్మకమైన మార్కెట్లలో ఒకటి. పోకీమాన్ గో 5వ వార్షికోత్సవం ఒక ముఖ్యమైన మైలురాయి ఇంకా భారతదేశంలో ఆగ్మెంటెడ్ రియాల్టీ వృద్ధి సామర్థ్యాన్ని సూచిస్తుంది. పోకీమాన్ గో ఫెస్ట్ 2021 ద్వారా ఉత్తమమైన ఏఆర్ గేమింగ్‌ను భారతదేశానికి తీసుకువచ్చేందుకు మేము కట్టుబడి ఉన్నాము.
undefined
పోకీమాన్ గో ఫెస్ట్ 2021లో ఆడుతున్న భారతీయ ట్రైనర్లు గ్లోబల్ ఛాలెంజ్ అరేనాలో పాల్గొనవచ్చు ! ఈ ప్రత్యేక అవకాశం టికెట్ హోల్డర్లకు మాత్రమే ఉంటుంది. ట్రైనర్స్ ఛాలెంజ్ పూర్తి చేస్తే మిగిలిన గంటకు బోనస్ లభిస్తుంది. ట్రైనర్స్ మొత్తం 24 చాలెంజెస్ పూర్తి చేస్తే వారు పోకీమాన్ గో ఫెస్ట్ 2021 తరువాత వారాల్లో టైం, స్పేస్, మిస్టరీ బోనస్‌లను అన్‌లాక్ చేస్తారు.
undefined