ఎయిర్‌టెల్ లో ఖరీదైన, బడ్జెట్ ప్రీ-పెయిడ్ ప్లాన్‌లు ఉన్నప్పటికీ యూజర్లు కేవలం రూ.3లకు 1 జిబి డేటా కూడా పొందవచ్చు. అయితే ఆ ఎయిర్‌టెల్ ప్లాన్ గురించి తెలుసుకుందాం...
undefined
ఎయిర్‌టెల్ రూ.558 ప్లాన్ ద్వారా వినియోగదారులకు రోజుకు 3 జీబీ డేటాతో పాటు ఆన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 56 రోజులు. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌తో పాటు ఈ ప్లాన్ ద్వారా ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా మొత్తం 168జిబి డేటా అందుబాటులో ఉంటుంది. అయితే దీని ప్రకారం చూస్తే 1 జిబి డేటా ధర కేవలం రూ .3.32 అవుతుంది.
undefined
మరో దేశీయ టెలికాం జియో గురించి మాట్లాడితే జియోలో 56 రోజుల వాలిడిటీతో ప్రతిరోజూ 3 జిబి డేటా అందిస్తున్న ప్రీ-పెయిడ్ ప్లాన్ లేదు. రోజుకు 3 జీబీ డేటాగల ప్లాన్‌ల జాబితాలో జియోలో 28 రోజులు, 84 రోజులు, 365 రోజుల వాలిడిటీతో ప్లాన్లు మాత్రమే ఉన్నాయి. మరోవైపు వోడాఫోన్ ఐడియా 56 రోజుల వాలిడిటీతో రోజుకు 3జిబి డేటాతో ఒక ప్లాన్ అందిస్తుంది, అయితే దీని ధర రూ .601. ఈ ప్లాన్‌తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విఐపి సబ్ స్క్రిప్షన్ కూడా ఒక సంవత్సరం పాటు అందిస్తుంది.
undefined
గత నెలలో ఎయిర్‌టెల్ రూ .456 ప్లాన్‌ను విడుదల చేసింది. దీని వాలిడిటీ 60 రోజులు మాత్రమే. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్ తో 50జిబి డేటా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ తో ప్రతి రోజు 100 ఎస్ఎంఎస్ కూడా అందుబాటులో ఉంటాయి. ఎయిర్‌టెల్‌కు చెందిన ఈ రూ .456 ప్లాన్ జియో రూ .447 ప్లాన్‌తో పోటీ పడనుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం అండ్ వింక్ మ్యూజిక్‌లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది.
undefined
ఎయిర్‌టెల్ రూ .456 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ఇంకా పేటీఎం వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లలో చూడవచ్చు. ఈ ప్లాన్‌తో ఫాస్ట్‌టాగ్ కొనుగోలు లేదా రీఛార్జ్ చేయడంపై 100 క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా షా అకాడమీలో ఆన్‌లైన్ క్లాసులు సౌకర్యం కూడా ఒక సంవత్సరం పాటు ఉచితంగా లభిస్తుంది.
undefined