Whatsapp New Features
Whatsapp : ఎవరిదగ్గరైనా స్మార్ట్ ఫోన్ ఉందంటే అందులో వాట్సాప్ ఉన్నట్లే. సరదాగా వ్యక్తిగత చాటింగ్, సీరియస్ గా ప్రొఫెషనల్ డిస్కషన్ నుండి శుభకార్యాల ఆహ్వానం వరకు ప్రతిదీ ఇప్పుడు వాట్సాప్ లోనే జరుగుతోంది. చాట్స్ మాత్రమే స్టేటస్ లు, కమ్యూనిటీలు, గ్రూప్ లు, కాలింగ్, లొకేషన్ షేరింగ్, కాంటాక్ట్ షేరింగ్, ఫైల్స్ ఆండ్ ఫోటోస్ ట్రాన్స్ఫర్... ఇలా ఎన్నో ఫీచర్లు వాట్సాప్ అందిస్తోంది. అంతేకాదు ఎప్పటికప్పుడు యూజర్స్ కు బెస్ట్ సర్వీస్ అందించేందుకు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తేస్తోంది.
ఇలా ఎప్పుడూ యూజర్లకు ఏం కావాలో గుర్తిస్తూ వాటిని అందుబాటులోకి తీసుకువస్తోంది వాట్సాప్. యూజర్ల అవసరాన్ని బట్టి మార్పులుచేర్పులు చేసుకుంటుంది కాబట్టే ఎన్ని మేసేజింగ్ యాప్స్ పోటీగావచ్చినా వాట్సాప్ క్రేజ్ తగ్గట్లేదు. రోజురోజుకు వాట్సాప్ వాడేవారి సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు.
తాజాగా వాట్సాప్ యూజర్లకు అనుకూలంగా ఉండేలా మరికొన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ తో పాటు ఐఓఎస్ ఫోన్లలోనూ అదనంగా కొన్ని ఫీచర్లు యాడ్ అయ్యాయి. వీటివల్ల వాట్సాప్ లో చోటుచేసుకున్న మార్పులేమిటి? ఇవి యూజర్లకు ఎలా ఉపయోగపతాయి? ఇక్కడ తెలుసుకుందాం.
Whatsapp New Features
వాట్సాప్ లో కొత్త ఫీచర్లు :
1. గ్రూప్స్ లో ఎంతమంది ఆన్లైన్ లో ఉన్నారో తెలుస్తుంది :
ఇప్పటివరకు వాట్సాప్ గ్రూప్ లోని ఎంతమంది ఆన్లైన్ లో ఉన్నారు, ఎంతమంది లేరో తెలిసేది కాదు. కానీ ఇకపై ఏ వాట్సాప్ గ్రూప్ లో ఎంతమంది యాక్టివ్ గా ఉన్నారో తెలుస్తుంది. గ్రూప్ లోని ఎంతమంది ఆన్లైన్ లో ఉన్నారో చూపించే ఫీచర్ ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇకపై వాట్సాప్ గ్రూప్స్ లోని యాక్టివ్ మెంబర్స్ ను ఈజీగా గుర్తించవచ్చు.
2. నోటిఫికేషన్ కంట్రోల్ :
కొన్ని వాట్సాప్ గ్రూప్స్ లో విరామం లేకుండా వచ్చే మెసేజ్ లో విసుగు తెప్పిస్తాయి. అయినా ఆ గ్రూప్ ఉండాలంటే వాటిని భరించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు... గ్రూప్ లో ఎవరైనా మనల్ని మెన్షన్ చేసినా లేదంటే మన మెసేజ్ లకు రిప్లై ఇస్తేనే నోటిఫికేషన్ వచ్చేలా సెట్ చేసుకోవచ్చు. అంటే ఇకపై అనవసర మేసేజ్ లకు సంబంధించిన నోటిఫికేషన్స్ రావు, అవసరమైన మెసేజ్ ల నోటిఫికేషన్ మాత్రమే మనకు వస్తాయన్నమాట.
Whatsapp New Features
3. ఐఫోన్ లో కొత్త ఫీచర్లు :
ఐఫోన్ యూజర్ల కోసం కూడా వాట్సాప్ కొత్త ఫీచర్లు తీసుకువచ్చింది. ఇందులో ముఖ్యమైనది డాక్యుమెంట్ స్కానింగ్. ఇంతకాలం ఐఫోన్ లో వాట్సాప్ ద్వారా స్కాన్ డాక్యమెంట్ ఆప్షన్ ఉండేదికాదు... కానీ ఇప్పుడు అటాచ్ మెంట్ సెక్షన్ దీన్ని చేర్చారు. దీన్ని ఉపయోగించిన ఈజీగా డాక్యుమెంట్స్ షేర్ చేసుకోవచ్చు.
ఇక వాట్సాప్ ను డీఫాల్ట్ కాలింగ్ యాప్ గా ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అలాగే వీడియో కాలింగ్ సమయంలో జూమ్ చేసే సదుపాయం కల్పించారు. అంటూ వీడియో కాలింగ్ లో అవసరమైతే జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు.
Whatsapp New Features
4. రియాక్షన్ ఎమోజీ :
గ్రూప్ లో ఏదయినా శుభవార్త పోస్ట్ చేస్తే అందరూ శుభాకాంక్షలు చెబుతారు. మీరు కూడా శుభాకాంక్షలు చెప్పాలంటే ప్రత్యేకంగా మెసేజ్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. అప్పటికే వచ్చిన రియాక్షన్స్ మీద క్లిక్ చేస్తే అప్పటికే ఎవరు ఏ ఎమోజీ పంపారో కనిపిస్తుంది. అందులో మీకు నచ్చినదానిపై ట్యాప్ చేస్తే మీ రియాక్షన్ కూడా నమోదవుతుంది.
5. ఇక వాట్సాప్ లోనూ షార్ట్స్ :
ఇకపై వాట్సాప్ లోనూ షార్ట్స్ సందడి కనిపించనుంది. గ్రూప్ అడ్మిన్లు 60 సెకన్ల షార్ట్ వీడియోలను షేర్ చేయవచ్చు. అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో మాదిరిగా ఇక వాట్సాప్ లో షార్ట్స్ షేర్ చేసుకోవచ్చు.