వాట్సాప్‌కి రూ.1942 కోట్ల జరిమానా.. కారణం ఎందుకంటే..?

First Published Sep 3, 2021, 11:53 AM IST

 సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్  వాట్సాప్‌కి ఐర్లాండ్ గురువారం 266 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ .1,942 కోట్ల జరిమానా విధించింది. ఈ మెసేజింగ్ యాప్ యూజర్ డేటాను దాని యాజమాన్య సంస్థ ఫేస్‌బుక్  ఇతర కంపెనీలతో పంచూకుంటుందని  ఇంకా  పారదర్శకంగా లేదని ఆరోపించింది. 

ఈ జరిమానా మూడు సంవత్సరాల క్రితం చేసిన జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (GDPR) కింద విధించింది.  డేటా ప్రైవసీ కమిషనర్ (డిపిసి) వాట్సాప్‌ పై ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. వాట్సాప్ పారదర్శకతపై 2018 ఈ‌యూ డేటా నియమాలను పాటిస్తుందా లేదా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర ఫేస్‌బుక్ కంపెనీలతో వాట్సాప్ షేర్ చేసిన సమాచారం ఇంకా డేటా గురించి కూడా ఇందులో ఉంది.

వాట్సాప్ అప్పీల్

వాట్సాప్ ప్రతినిధి జాషువా బ్రేక్మన్ ఈ జరిమానా అన్యాయమని, దానికి వ్యతిరేకంగా అప్పీల్ చేస్తామని చెప్పారు. 

అందువల్ల  ఆదేశం 
ఐర్లాండ్‌లో తక్కువ కార్పొరేట్ పన్ను రేట్లు ఉంటాయి. అందుకే యూరోపియన్ ప్రధాన కార్యాలయాలు,ఫేస్ బుక్, గూగుల్, ట్విట్టర్, ఆపిల్ సహా ఇరవై కంపెనీల కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి.  
 

ప్రస్తుత సందర్భంలో కూడా జరిమానా దాదాపు 433 కోట్ల వద్ద ఉంది, అయితే దీనిని పెంచాలని మిగిలిన ఈ‌యూ  దేశాలు ఒత్తిడి చేశాయి, దీంతో ఈ  జరిమానా దాదాపు ఐదు రెట్లు పెంచింది. తాజా ఉత్తర్వు ఇతర దేశాలను కూడా ఇలాంటి చర్య తీసుకునేలా చేసింది.

click me!