మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇలా చిటికెలో తెలుసుకోండి..

First Published | Aug 31, 2021, 12:58 PM IST

భారతదేశంలో ఒక వ్యక్తి పేరు (ఐడి)తో  ఒకేసారి 9 సిమ్ కార్డులు ఆక్టివ్ గా పనిచేస్తాయి, ఇంత కంటే ఎక్కువ సిమ్ కార్డులు మీ పేరుతో నమోదైతే మీపై ఇన్స్పెక్షన్(నిఘా) ఉంటుంది. 2018 వరకు సిమ్ కార్డు పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కానీ ఇప్పుడు అలా కాదు. మీకు సిమ్ కావాలంటే మీరు ఓటరు కార్డు లేదా ఆధార్ కార్డు రెండింటి నుండి సిమ్ కార్డును పొందవచ్చు. 

సాధారణంగా మన ఐ‌డితో ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేస్తాము ఒకోసారి ఆ సిమ్ కార్డులు ఉపయోగించనప్పుడు వాటిని మర్చిపోతాము. అంతేకాదు మీ కుటుంబ సభ్యులకు లేదా బంధువులకు మీ పేరు మీద సిమ్ కార్డులను కొని ఇస్తుంటారు. ఇప్పుడు మీ ఐ‌డితో లేదా మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఎన్ని యాక్టివ్‌గా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే   ఇలా చేయండి...
 

DoT డొమైన్ tafcop.dgtelecom.gov.in ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా  ఆక్టివ్ లో ఉన్న అన్ని మొబైల్ నంబర్ల డేటాబేస్ ఈ పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ పోర్టల్ ద్వారా స్పామ్ అండ్ మోసాలను అరికట్టడం జరుగుతుంది. మీ పేరుతో  అంటే మీ ఐ‌డి ప్రూఫ్ తో మొబైల్ నంబర్‌ను వేరొకరు ఉపయోగిస్తున్నట్లు మీకు అనిపిస్తే ఈ వెబ్‌సైట్ ద్వారా మీరు ఫిర్యాదు చేయవచ్చు, అయితే ఈ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ సదుపాయం ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిళ్లకు మాత్రమే అందుబాటులో ఉంది . అయితే ఈ వెబ్‌సైట్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ...


ముందుగా మీ మొబైల్ ఫోన్ బ్రౌజర్ లేదా ఏదైనా ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో tafcop.dgtelecom.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత మీ 10 అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి. ఇప్పుడు మీ నంబర్‌కు ఓ‌టి‌పి వస్తుంది. ఆ ఓ‌టి‌పిని ఎంటర్ చేసి వేరిఫై పై క్లిక్ చేయండి.

ఓ‌టి‌పిని వేరిఫై చేసిన తర్వాత మీ పేరుతో యాక్టివ్‌గా ఉన్న అన్ని నంబర్‌ల పూర్తి లిస్ట్ మీకు చూపిస్తుంది. మీరు వాటిలో మీకు తెలియని లేదా వాడని   సిమ్/నంబర్ మీ పేరుతో  ఉన్నట్లయితే  వెంటనే నివేదించవచ్చు. ఆ తర్వాత ప్రభుత్వం మీ పేరుతో నడుస్తున్న లేదా మీరు ఫిర్యాదు చేసిన నంబర్‌ను తనిఖీ చేస్తుంది.

tafcop.dgtelecom.gov.in ప్రస్తుతం కొన్ని సర్కిళ్లలోనే అందుబాటులో ఉంది. త్వరలో మిగతా అన్ని సర్కిళ్లలో అందుబాటులోకి రానుంది. ఒక ఐ‌డితో గరిష్టంగా తొమ్మిది సిమ్ కార్డులు యాక్టివ్‌గా ఉండవచ్చు, కానీ ఈ పోర్టల్‌లో మీరు మీ పేరుతో ఉన్న మీకు తెలియని నంబర్‌ను చూస్తే లేదా మీరు ఉపయోగించకపోతే ఆ నంబర్ గురించి ఫిర్యాదు చేయవచ్చు. దీని తరువాత ప్రభుత్వం ఆ నంబరును బ్లాక్ చేస్తుంది.
 

Latest Videos

click me!